Man Loses Memory After Intercourse: ఐర్లాండ్‌కి చెందిన ఓ 66 ఏళ్ల వృద్ధుడికి వింత అనుభవం ఎదురైంది. భార్యతో 10 నిమిషాల శృంగారం తర్వాత అతన్ని మతిమరుపు ఆవహించింది. కొద్దిరోజులుగా జరిగనవేవీ అతనికేమీ గుర్తులేకుండా పోయాయి. శృంగారం తర్వాత సెల్‌ఫోన్ చేతిలోకి తీసుకున్న అతను.. అందులో తేదీ చూసి షాకయ్యాడు. ఆ ముందు రోజే తన పెళ్లి రోజు అన్న విషయాన్ని మరిచిపోయాడు. నిజానికి భార్యతో కలిసి అతను పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్నాడు. కానీ ఆ విషయాలేవీ అతనికి గుర్తులేవు. ఐరిష్ మెడికల్ జర్నల్ 'మే' నెల సంచికలో ఈ కేసు వివరాలను వెల్లడించారు.
ఐరిష్ మెడికల్ జర్నల్ కథనం ప్రకారం... భార్యతో శృంగారం తర్వాత మతిమరుపు ఆవహించిన ఆ వృద్ధుడు ఆరోజు, ఆ ముందు రోజు జరిగనవేవీ గుర్తుకు తెచ్చుకోలేకపోయాడు. ఆ రెండు రోజులు ఏం జరిగిందో చెప్పాలంటూ భార్య, కూతురిని పదే పదే అడిగాడు. శృంగారం తర్వాత ఇలా మతిమరుపు ఆవహించడాన్ని వైద్య పరిభాషలో ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నేసియా (టీజీఏ)గా పరిగణిస్తారు. ఇది చాలా అరుదుగా తలెత్తే సమస్య. ముఖ్యంగా 50-70 ఏళ్ల వయసువారిలో ఇలాంటి సమస్యలు కనిపిస్తాయి.
ఈ సమస్య తలెత్తినవారిలో స్వల్పకాలిక మతిమరుపు ఉంటుంది. కొద్దిమందికి దీర్ఘకాలిక మతిమరుపు సమస్య కూడా రావొచ్చు. అంటే, ఏడాది క్రితం నాటి సంఘటనలు కూడా వారికేమీ గుర్తుండవు. తాజా కేసులో సదరు వృద్ధుడికి తన పేరు, వయసు, ఇతరత్రా వివరాలన్నీ గుర్తున్నాయి. కానీ రెండు రోజులుగా జరిగనవేవీ ఎంత ప్రయత్నించినా అతనికి గుర్తురాలేదు.
2015లోనూ అతనికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తాజాగా మరోసారి అతను టీజీఏ బారినపడటంతో స్థానికంగా న్యూరాలజీ పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్టులన్నీ నార్మల్ అనే వచ్చాయి. సాధారణంగా టీజీఏ అనేది పెద్ద సమస్య కాదని.. దాని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదని ఐరిష్ మెడికల్ జర్నల్ కథనంలో పలువురు వైద్యులు పేర్కొన్నారు.
Also Read: Yama Raj Death Signals: మృత్యు గడియలు సమీపించే ముందు కనిపించే 4 సంకేతాలివే...
Also Read: Minister Karumuri Comments: నోరు జారిన ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..ఏంటా కథ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook