YS Sharmila: తన రాజకీయాలు, వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్న సోషల్‌ మీడియా కార్యకర్తలపై కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగానూ తీవ్ర విమర్శలు చేస్తుండడంతో షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలాంటి విమర్శలు, ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎనిమిది మందిపై ఆమె కేసు నమోదు చేయించారు. షర్మిలను విమర్శిస్తున్న వారిలో శ్రీరెడ్డితోపాటు వర్రా రవీంద్రా రెడ్డి తదితరులు ఉన్నారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Telangana: ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు.. రద్దు చేయనున్నారా లేక?


సోషల్‌ మీడియాలో తనపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారంటూ వైఎస్‌ షర్మిల ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించి ఆమె కేసు నమోదు చేయించారు. తనపై శ్రీరెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి, మేదరమెట్ల కిరణ్‌ కుమార్‌, రమేశ్‌ బులుగాకుల, పంచ్‌ ప్రభాకర్‌ రెడ్డి, ఆదిత్య సత్యకుమార్‌ దాసరి, సేనాని, మహ్మద్‌ పాషా అనే వ్యక్తులపై షర్మిల ఫిర్యాదు దాఖలు చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు పరిశీలిస్తున్నారు. ఫిర్యాదుతో పాటు యూట్యూబర్లు, సోషల్‌ మీడియా కార్యకర్లు చేస్తున్న ప్రచారానికి సంబంధించిన ఐడీలు, లింక్‌లు తదితర సమర్పించారని సమాచారం.

Also Read: VIPs Drivers: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ప్రముఖుల డ్రైవర్లకు 'ఫిట్‌నెస్‌ టెస్టులు'


ఫిర్యాదు చేసిన 8 మందికి నోటీసులు జారీ చేయడమో.. అరెస్ట్‌ చేయడమో చేస్తారని షర్మిల భావిస్తున్నారు. కాగా ఫిర్యాదుచేసిన వారిలో వైసీపీకి చెందిన సోషల్‌ మీడియా వారే ఎక్కువగా ఉన్నారు.. వర్రా రవీంద్రా రెడ్డి ఫక్తూ జగన్‌కు పని చేస్తున్నారు. మిగిలిన వారంతా వైసీపీకి అండదండగా నిలుస్తున్నారు. తెలంగాణ రాజకీయాలను వదిలేసి ఏపీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల గుర్తించారు. ఇన్నాళ్లు తెలంగాణ ఆడబిడ్డగా ఉన్న షర్మిలను ఇప్పుడు ప్రధానంగా టార్గెట్‌ చేసి సోషల్‌ మీడియ వేదికగా వేధింపులు చేస్తున్నారని షర్మిల అనుచరులు చెబుతున్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ట్రలింగ్స్‌కు పాల్పడుతున్నారని షర్మిల వర్గం చెబుతోంది. అయితే ఏపీలో కాకుండా తెలంగాణలో ఫిర్యాదు చేయడం వెనుక వేరే కారణం కూడా ఉంది. 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తనకు న్యాయం జరగదని వైఎస్‌ షర్మిల భావిస్తున్నారు. సీఎం జగన్‌ తనకు ఎలాంటి న్యాయం చేయడనే భావనలో షర్మిల ఉన్నారు. గతంలో వైఎస్‌ జగన్‌ మరో సోదరి వైఎస్‌ సునీత కూడా తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా గతంలో తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు షర్మిల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఓ ప్రముఖ నటుడుతో రహస్య సంబంధంపై తీవ్ర ఆరోపణలు, వార్తలు కూడా వచ్చాయి. వాటిపై న్యాయ పోరాటం చేశారు. తాజాగా ఇప్పుడు రాజకీయంగా ఆమె ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన ఎనిమిది మందిపై కఠిన చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్‌ చేస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి