YS Sharmila speech at Nirudyoga nirahara deeksha: ఖమ్మం: నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. 54 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. కేవలం 7 ఏళ్లలో నిరుద్యోగం 4 రెట్లు పెరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగం (Unemployment) పెరగడానికి సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్య వైఖరే కారణం అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌కు పరిమితమవడం వల్లే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు (Unemployees suicides) చేసుకుంటున్నప్పటికీ.. సీఎం కేసీఆర్‌లో మాత్రం దున్నపోతు మీద వానపడినట్టు ఏ మాత్రం చలనం లేదు అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వైఎస్ఆర్ టీపీ చేపట్టిన నిరుద్యోగ నిరాహార దీక్షలో మాట్లాడుతూ వైఎస్ షర్మిల ఈ ఆరోపణలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిరుద్యోగులు ఎంత మంది చనిపోతే నాకేంటీ.. నా కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలు ఉన్నాయి కదా అనే వైఖరితో సీఎం కేసీఆర్‌ ఉన్నారు. కానీ ఉద్యోగాల కోసం ఇంకెంత కాలం వేచిచూడాలి ? ఇంకెన్ని అవమానాలు భరించాలి ? ఇంటా, బయట సమాజంలో అవమానాలు భరించలేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్‌కు (CM KCR) మాత్రం చీమకుట్టినట్టు కూడా లేదు అని షర్మిల మండిపడ్డారు.


Also read : Delta virus transmits through air: డెల్టా వైరస్ గాలి ద్వారా సోకుతుంది


కేసీఆర్‌ 50 వేల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాడంటే.. దానికి కారణం వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ..
నిరుద్యోగుల కోసం ప్రతీ మంగళవారాన్ని నిరుద్యోగ వారంగా భావిస్తూ నిరుద్యోగుల కోసం, వారికి రావాల్సిన ఉద్యోగాల కోసం పోరాడాలని తాము నిరాహార దీక్షలు చేస్తోంటే.. కేసీఆర్‌ కొడుకు మంత్రి కేటీఆర్ వ్రతాలు అని మాట్లాడుతున్నాడు అని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆడవాళ్లం కనుక వంటలు, వ్రతాలు చేసుకోవాలని కేటీఆర్‌ ఉద్దేశం. సరే.. మేము ఆడవాళ్లమే.. నిరుద్యోగుల కోసం అన్నం మెతుకు ముట్టకుండా నిరాహార దీక్షతో వ్రతమే (Vratam) చేస్తున్నం అనుకుందాం. మరి వీళ్లు అధికారంలో ఉన్న పెద్ద మొగోళ్లు కదా.. ఒక అంచనా ప్రకారం కొత్త జిల్లాలు, మండలాలు కలుపుకుంటే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 3.85 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఆ ఖాళీలను భర్తీ చేస్తే.. వీళ్లు పెద్దోళ్లు అని ఒప్పుకుంటాం అని షర్మిల (YS Sharmila slams Ktr) సవాలు విసిరారు. 


కేటీఆర్‌కు (Minister KTR) మహిళలంటే గౌరవం లేదు.


కేటీఆర్‌కు (Minister KTR) మహిళలంటే గౌరవం లేదు. ఇంక వారి మంత్రులు ఏం మాట్లాడుతారు. ఒక మంత్రి (నిరంజన్‌ రెడ్డి Minister Niranjan Reddy) నిరుద్యోగులు హమాలీ పనికి వెళ్లొచ్చు కదా అని మాట్లాడుతున్నాడంట. వాస్తవానికి ఆ మంత్రే రాజీనామా చేసి హమాలీ పనికి వెళ్లాలి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 5, 6 తరగతులు చదివిన వారు మంత్రులు కావొచ్చు కానీ, పీజీలు చదివిన వారు హమాలీ పనికి వెళ్లాలా ? పెద్ద చదువులు చదివితే ప్రశ్నించే గొంతులు లేస్తాయనే భయంతోనే ప్రభుత్వం ఉన్న స్కూళ్లను మూసేస్తోంది అని షర్మిల ఆరోపించారు.


Also read : Revanth Reddy, Kokapeta lands: రేవంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్


టీచర్‌ ఉద్యోగాలు భర్తీ (Teachers recruitment) చేయడం లేదు. యూనివర్సిటీకి ఫండ్స్‌ రిలీజ్‌ చేయడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఈ ప్రభుత్వం ఇచ్చే బోడి రూ.35 వేలు రిలీజ్‌ చేయడం లేదు. ఫీజు రీఇంబర్స్‌మెంట్ విడుదల కాకపోవడంతో కాలేజీలు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. 


కేసీఆర్‌ ఇంట్లో బాత్‌రూంలు కూడా బుల్లెట్‌ ప్రూఫ్‌ (Bullet proof).
కేసీఆర్‌ ఇంట్లో బాత్రూమ్స్‌కి కూడా బుల్లెట్‌ ప్రూఫ్‌ ఉందంట. మరి ఆయన ప్రాణాలకు అంత విలువ ఉన్నప్పుడు నిరుద్యోగుల ప్రాణాలకు ఎందుకు విలువ లేదు అని షర్మిల ప్రశ్నించారు.


రైతులు తాము పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు. ఆరోగ్య శ్రీ లేదు. పక్కా ఇళ్లు లేవు. పెన్షన్‌ (Pension) లేదు. కేవలం రేషన్ బియ్యం బిక్షం ఇచ్చినట్టుగా ఇచ్చి మిగతావన్ని వదిలేస్తే సరిపోతుందా ? అని తెలంగాణ ప్రభుత్వంపై (Telangana govt) వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


Also read : AP CM YS Jaganపై అలిగి YSR Telangana Party పెట్టలేదన్న వైఎస్ షర్మిల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook