YSRTP Merger: వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్ తెలంగాణ త్వరలో కాంగ్రెస్ పార్టీలో విలీనం విషయమై గత కొద్దికాలంగా చర్చలు నడుస్తున్నాయి. అంతా అయిపోయింది, ఇక విలీనమే తరువాయని భావిస్తున్న తరుణంలో ఆ ప్రక్రియ ఒక్కసారిగా ఆగిపోయింది. తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ రంగ ప్రవేశంతో పరిస్థితి మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైఎస్ షర్మిల సేవలు ఏపీలో వాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంటే, షర్మిల అందుకు విరుద్ధంగా తెలంగాణకు పరిమితం కావాలని అనుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సైతం షర్మిల తెలంగాణకు రావడం ఇష్టం లేదు. ఆయన వర్గం నేతలు మొదట్నించీ ఆమెను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపధ్యంలో షర్మిల పార్టీ విలీనం అంశం వెనక్కి వెళ్లింది. 


తిరిగి ఇప్పుుడు కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యం కలిగిన డీకే శివకుమార్ , కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కానుగోలు రంగ ప్రవేశం చేసిన షర్మిలతో చర్చలు జరిపారు. దాంతో కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ - షర్మిల మధ్య డీకే శివకుమార్ వారధిలా నిలబడ్డారు. కొద్దిరోజుల క్రితం షర్మిల కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్, సోనియాలతో సమావేశమయ్యారు. షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం పాలేరు సీటును పొంగులేటి లేదా తుమ్మలకు కేటాయించాలనే ఆలోచనలో ఉంది. 


మొత్తానికి డీకే శివకుమార్, సునీల్ రంగంలో దిగి షర్మిలతో మరోసారి చర్చలు జరపడంతో పరిస్థితి కొలిక్కి వచ్చినట్టు కన్పిస్తోంది. ఈ నెల 30 ఈ అంశంపై తేల్చేందుకు డెడ్‌లైన్ నిర్ధారించారు. షర్మిలకు రాజ్యసభ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చేందుకు ఢిల్లీ అధిష్టానం నుంచి హామీ లభించింది. పాలేరు నుంచి కాకపోతే ఖమ్మం లోక్‌సభ కేటాయించాల్సిందిగా వైఎస్ షర్మిల కోరినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోవల్సి ఉంది. సీటు విషయంలో క్లారిటీ వస్తే షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అంశం త్వరలోనే జరగనుంది.


Also read: Kishan Reddy Warns KCR: కేసీఆర్‌, కల్వకుంట్ల కుటుంబానికి కిషన్ రెడ్డి వార్నింగ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook