Ys Sharmila Deeksha: తెలంగాణలో వైఎస్ షర్మిల వేగం పెంచారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలనే ప్రధాన డిమాండ్‌తో చేపట్టిన దీక్షను ఇవాళ విరమించారు. అమరవీరులు, నిరుద్యోగ కుటుంబ సభ్యులు వైఎస్ షర్మిలతో దీక్ష విరమింపజేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో రాజకీయాల్లో ప్రవేశించిన వైఎస్ షర్మిల (Ys Sharmila) అందుకనుగుణంగా వ్యూహం పన్నుతున్నారు. ప్రజా సమస్యలపై ముందుండి పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించిన వైఎస్ షర్మిల త్వరలో రాజకీయ పార్టీ ( Ys sharmila new political party) ప్రకటన చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఇందిరా పార్క్ వేదికగా ఉద్యోగ దీక్ష చేపట్టారు. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలని కోరుతూ  ఇందిరా పార్క్ వద్ద 72 గంటల సేపు దీక్ష ( Ys sharmila Deeksha) కు పిలుపునిచ్చారు. అయితే దీక్షకు సాయంత్రం వరకూ అనుమతి ఉందన్న పోలీసులు ఆమెను ఆ రోజు సాయంత్రం అడ్డుకున్నారు. దాంతో పాదయాత్రగా ఇందిరా పార్క్( Indira park) నుంచి లోటస్ పాండ్‌కు బయలుదేరిన వైఎస్ షర్మిలను పోలీసులు మధ్యలో అడ్డుకుని నేరుగా లోటస్ పాండ్‌కు తరలించారు. దాంతో వైఎస్ షర్మిల లోటస్ పాండ్‌లోనే దీక్షను కొనసాగించారు. 


ఇవాళ నిరుద్యోగ, అమరవీరుల కుటుంబసభ్యులు వైఎస్ షర్మిల ( Ys sharmila deeksha) తో దీక్ష విరమింపజేశారు. గత మూడ్రోజులుగా లోటస్ పాండ్ వేదికగా దీక్ష చేయడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. వైద్యపరీక్షలు చేసిన వైద్యులు సుగర్ లెవెల్స్ 88 నుంచి 62కు తగ్గాయని..2 కిలోల బరువు తగ్గారని చెప్పారు.


Also read: Telangana Corona Cases: తెలంగాణలో 5 వేలు దాటిన కరోనా కేసులు, ఏకంగా 15 మరణాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook