Sharmila comment: ఓ దొర.. రైతుల వైపు చూడు.. కేసీఆర్‌పై షర్మిల మండిపాటు..!
Sharmila comment: తెలంగాణలో అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల సీఎం కేసీఆర్ ఆలిండియా పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు వచ్చారు. దీనిని విపక్షాలు తప్పుపడుతున్నాయి.
Sharmila comment: తెలంగాణలో అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల సీఎం కేసీఆర్ ఆలిండియా పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు వచ్చారు. దీనిని విపక్షాలు తప్పుపడుతున్నాయి. సీఎం కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్‌లో రైతు రాములు కుటుంబసభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఇటీవల వరి కుప్పల వద్ద రైతు రాములు కుప్పకూలి చనిపోయాడు. దీనిపై రాజకీయ దుమారం రేగింది.
సీఎం కేసీఆర్‌కు పంజాబ్ రైతుల చావులే కనిపిస్తున్నాయా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ రైతుల సమస్యలు కేసీఆర్ కంటికి కనిపించవా అని ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను పట్టించుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు వచ్చి 10 రోజులైనా ధాన్యం తీసుకునే పరిస్థితి లేదని చెప్పారు. కొంటారో కొనరో తెలియక రైతులు వరి కుప్పల వద్దే కుప్పకూలి చనిపోతున్నారన్నారు. ఆరుగాలం పండించిన పంట వర్షానికి తడిసి ముద్దైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలు సీఎం కేసీఆర్ తెలియవా అని విమర్శించారు.
సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల రైతుల్లో ఖరీఫ్ భయం పట్టుకుందన్నారు. వానాకాలంలో రైతులకు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి గింజా కొంటామని చెప్పి రైతులను నిండా ముంచుతున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇప్పటికైనా వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రజా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం..ప్రతి గింజా కొనేలా చేస్తామన్నారు.
తెలంగాణలో పాదయాత్ర కొనసాగించిన వైఎస్ షర్మిల..రైతుల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. ప్రతి మంగళవారం రైతు గోస పేరుతో భారీ బహిరంగ సభలకు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తీసుకొస్తామని స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ఎలాంటి పథకాలు తీసుకొచ్చారో..తెలంగాణలో అలాంటి కార్యక్రమాలు తీసుకొస్తామంటున్నారు వైఎస్ షర్మిల.
Also read:Riyan Parag-R Ashwin: రియాన్ పరాగ్.. నువ్ ఎప్పటికీ భారత జట్టులోకి రాలేవు! నువ్వు కోహ్లీవి కాదు
Also read:Kapil Sibal: కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్..పార్టీకి సీనియర్ నేత గుడ్‌బై..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి