GT vs RR Qualifier 1, Riyan Parag will never make it to indian team with this attitude: ఐపీఎల్ 2022 తొలి క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్ ఫైనల్ వెళ్లిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (89; 56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. కెప్టెన్ సంజూ శాంసన్ (47; 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (68 నాటౌట్; 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (40 నాటౌట్; 27 బంతుల్లో 5 ఫోర్లు) దంచికొట్టారు.
ఈ మ్యాచులో రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ కాస్త అతిగా (ఆటిట్యూడ్) ప్రవర్తించాడు. సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాడు. రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ చివరి ఓవర్ చివరి బంతికి అశ్విన్ స్ట్రైక్ చేస్తున్నాడు. చివరి బంతిని యష్ దయాల్ వైడ్ వేశాడు. రన్ వచ్చే అవకాశం లేకున్నా.. పరుగు కోసం పరాగ్ బౌలింగ్ ఎండ్ నుంచి పరిగెత్తాడు. ఇది చూడని అశ్విన్ అలాగే క్రీజులో ఉన్నాడు. దాంతో పరాగ్ రనౌట్ అయ్యాడు. అసహనానికి గురైన పరాగ్.. అశ్విన్ వైపు సీరియస్‌గా చూస్తూ.. రన్ ఎందుకు తీయలేదు అని అన్నాడు.
రియాన్ పరాగ్ ఆగ్రహంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ సీనియర్ ఆటగాడి పట్ల ఇలాగేనా వ్యవహరించేది అని నెటిజన్లు పరాగ్‌పై మండిపడుతున్నారు. 'ఇలా ఆటిట్యూడ్ ఉంటే.. నువ్ ఎప్పటికీ భారత జట్టులోకి రాలేవు' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'నువ్ విరాట్ కోహ్లీవి ఏం కాదు.. ఇలా అరవడానికి' అని ఇంకొకరు ట్వీటారు. 'ఆటిట్యూడ్ ఏమో కోహ్లీలా ఉంది.. ప్రదర్శన మాత్రం విజయ్ శంకర్‌లా ఉంది', 'జట్టు సభ్యులను తిడుతున్నావ్ కదా.. ఓ రోజు నిన్ను కూడా ఒకరు తిడుతారు' అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Garba Queen Riyan Parag attitude is like he scored 700+ runs 😂#GTvsRR #RRvGT #riyanparag pic.twitter.com/Iw6eOmtZIa
— चारsauबीस (@charsau20) May 24, 2022
అంతకుముందు కూడా రియాన్ పరాగ్ సహచర ఆటగాడిపై అరిచాడు. గుజరాత్ ఛేజింగ్ చేస్తున్న సమయంలో ట్రెంట్ బౌల్ట్ వేసిన 16వ ఓవర్లో డేవిడ్ మిల్లర్ లాంగ్ ఆన్ వైపు ఓ షాట్ ఆడాడు. లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పరాగ్ వేగంగా పరిగెత్తి బంతి బౌండరీకి వెళ్లకుండా ఆపాడు. బౌండరీకి టచ్ అవుతానేమోనని బంతిని దేవదత్ పడిక్కల్ వైపు విసిరేశాడు. పడిక్కల్ కాస్త నెమ్మదించడంతో పరాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. త్వరగా బాల్ అందుకుని త్రో వేయి అన్నట్లు కోపంగా చూశాడు. ఇందుకు సంబందించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది.
Riyan Parag starter pack.#GTvRR pic.twitter.com/ZZU7f98ZHU
— ㅤ ㅤ ㅤ ㅤ ㅤ ㅤ ㅤ ㅤ ㅤ (@theesmaarkhan) May 25, 2022
Day won't be long if Riyan parag keeps scolding his team mates one or other will scold him in return.
— Sai (@akakrcb6) May 24, 2022
Riyan Parag will never make it to indian team with this attitude
— time square 🇮🇳 (@time__square) May 24, 2022
Also Read: Konaseema Protest: అప్పుడు తుని.. ఇప్పుడు అమలాపురం! మంటలతో భీతిల్లిన గోదావరి జనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి