YS Sharmila Slams BJP, BRS: నిర్మా వాషింగ్ పౌడర్ కేసీఆర్‌కు సైతం పనిచేసినట్టు ఉంది అంటూ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిర్మాతో నిర్మల్ వేదికగా దొర ముసుగు తొలగిపోయింది. బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి ఉన్న దోస్తీ బయటపడింది. కారు - కమలం రెండూ ఒక్కటేనని రూడీ అయిపోయింది అని వైఎస్ షర్మిల ఆరోపించారు. కేసీఆర్ ముఖంలోనూ ఆ తళతళ మెరుపు కనపడ్డది అని ఆమె ఎద్దేవా చేశారు. నోరు విప్పితే చాలు ఎప్పుడూ బీజేపీని తిడుతూ కనిపించే కేసీఆర్ దొర..  ప్రధాని నరేంద్ర మోదీని పల్లెత్తుమాట కూడా అనడం లేదు అంటే పరిస్థితి ఏంటో, ఎందుకలా మారిపోయారో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిడ్డ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో దొరకగానే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి రహస్యంగా బీజేపీకి పొర్లు దండాలు పెట్టాడు. కొడుకు రియల్ ఎస్టేట్ మాఫియా బయటపడకుండా బీజేపీ అధిష్టానం ముందు మోకాళ్లు వంచాడు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సీఎం కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్ల గురించి ఎలాంటి లెక్కలు అడగవద్దని ఢిల్లీకి వెళ్లి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సలాం కొట్టిండు అని ఆరోపించిన వైఎస్ షర్మిల... తమ అవసరానికి తగినట్టుగా తమ వేషాలు మారుస్తూ.. జనాలను బురిడి కొట్టించి పిచ్చోళ్ళను చేయడమే బీఆర్ఎస్ పార్టీ, బీజేపిల మధ్య ఉన్న రహస్య అజెండా అని మండిపడ్డారు. 


బీఆర్ఎస్ పార్టీ, బీజేపి మధ్య రహస్య స్నేహం ఉందన్న వైఎస్ షర్మిల.. ఈ రెండు పార్టీల తీరు లోకం ముందు నువ్వు కొట్టినట్లు చేస్తే.. నేను ఏడ్చినట్లు చేస్తా..  అన్న చందంగా ఉంది అని ఎద్దేవా చేశారు. అంతటితో ఊరుకోని వైఎస్ షర్మిల.. ఇంతకీ మీరు నడిపే రహస్య దోస్తానం ప్రీ పోల్ ఒప్పందమా ? లేక పోస్ట్ పోల్ ఒప్పందమా ? అని సూటిగానే ప్రశ్నించారు.


కమలం ముసుగు కప్పుకొని కారులో తిరుగుతున్న కేసీఆర్ దొర తన అసలు రూపాన్ని, బీజేపితో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న రహస్య ఒప్పందాన్ని బయటపెట్టాలి అని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడిన కేసీఆర్ అవినీతి లెక్కల గురించి నోరెత్తని బీజేపీ కూడా బీఆర్ఎస్ విషయంలో తమ మధ్య ఏం నడుస్తోంది అనేది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. 


ఇది కూడా చదవండి : 10 years Old Boy Drawing Skills: చూసింది చూసినట్టు అచ్చు దించేస్తాడు..


రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు మద్దతు తెలపడమే బీజేపీ చేసుకున్న రహస్య ఒప్పందమా అని వైఎస్ షర్మిల నిలదీశారు. లేదంటే, ఎన్నికల్లో గెలిచిన తరువాత కేసీఅర్ అధికారంలోకి రావడానికి సీట్లు తక్కువ పడితే ఆయనకు ఎమ్మెల్యేలను సప్లై చేసే సప్లై కంపెనీయే మీ తెర వెనుక ఒప్పందమా ? అని ఎద్దేవా చేశారు. ఏ ఒప్పందం లేకపోయినట్టయితే.. తెలంగాణలో కేసీఆర్ అవినీతిపై కేంద్రం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై కేంద్రం ఎందుకు ఇలా సాగదీత ధోరణి అవలంభిస్తోంది అని మండిపడ్డారు. ఏదేమైనా తక్షణమే బీజేపీ నోరు విప్పాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ, బీజేపిలపై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


ఇది కూడా చదవండి : Ponguleti Srinivas Reddy: మా పార్టీలోకి రండి.. పొంగులేటికి కేఏ పాల్ బంపర్ ఆఫర్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK