YS Sharmila: ప్రజలకు చిప్ప చేతిలో పెడుతున్నడు.. సీఎం కేసీఆర్‌పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
YS Sharmila on Telangana Debts: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై వైఎస్ షర్మిల ఆరోపణలు గుప్పించారు. ధనిక రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ధన దాహానికి సీఎం కేసీఆర్ బలి చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలదీశారు.
YS Sharmila on Telangana Debts: రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రం పేరిట "అప్పులు చేసి దొర పప్పు కూడు" తింటూ ప్రజలకు చిప్ప చేతిలో పెడుతున్నారంటూ సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బంగారు తునకలాంటి ధనిక రాష్ట్రాన్ని తన ధన దాహానికి బలి చేశారని అన్నారు. అప్పు పుట్టనిదే.. ఉన్న భూములు అమ్మనిదే రాష్ట్రం ముందుకు పోలేని దీనస్థితికి తెచ్చారంటూ విమర్శించారు. 5 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా రాష్ట్ర ఖజానాలో చిల్లిగవ్వ లేకుండాపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్కాములతో నిధులన్ని స్వాహా చేసి.. స్కీములను "కాం" చేశారని అన్నారు షర్మిల. ఇంతకాలం దోచుకుతిన్నది చాలక ఎన్నికలకు మూడు నెలల ముందు పథకాలకు అప్పులు కావాలని కేంద్రం వద్ద కొత్త డ్రామాకు తెర లేపుతున్నారని పేర్కొన్నారు. 'మరో లక్ష కోట్ల అప్పులకు తంటాలు పడే కేసీఆర్ గారు.. తెచ్చిన 5 లక్షల కోట్ల అప్పులతో రుణమాఫీ కింద 21 వేల కోట్లు ఎందుకు మాఫీ చేయలేదు..? 12 లక్షల మంది పక్కా ఇండ్లకు దరఖాస్తు పెట్టుకుంటే ఎందుకు కట్టలేదు..?' ఆమె ప్రశ్నించారు.
దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు కొనియ్యలేదని నిలదీశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించాల్సిన 5 వేల కోట్లు ఎందుకు చెల్లించలేదన్నారు. 20 వేల కోట్లతో ఉచిత ఎరువులు కొనలదేన్నారు. 50 లక్షల మంది నిరుద్యోగులకు రూ.3016 నిరుద్యోగ భృతి హామీ ఎందుకు నెరవేర్చలేదని అడిగారు. కాంట్రాక్టర్లకు 37 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంచారని అన్నారు. అభివృద్ధి కోసమే అప్పులు చేసే కేసీఆర్.. తెచ్చిన అప్పులన్నీ ఎక్కడ పెట్టారు..? అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని.. అభివృద్ధి అంటే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడమేనా అని షర్మిల నిలదీశారు. చేసిన అప్పులను సొంత ఖజానాకు మళ్లించి.. రాష్ట్ర సంపదను విలాసాలకు వాడుకున్నారని ఆరోపించారు. ఒక్కో నెత్తిపై 2 లక్షల అప్పు పెట్టిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరపడ్డాయని జోస్యం చెప్పారు.
Also Read: Bank Holiday August 2023: ఆగస్టు నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే..!
Also Read: CM Jagan Mohan Reddy: రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకతంగా నిలిచిపోయే రోజు: సీఎం జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి