YS Sharmila: పాలేరు గడ్డ వైఎస్సార్ బిడ్డకు అడ్డా.. వైఎస్ షర్మిల కామెంట్స్
YS Sharmila Unveiled YSR Statue: పాలేరు గడ్డ వైఎస్సార్ బిడ్డకు అడ్డా అని అన్నారు వైఎస్ షర్మిల. పాదయాత్రను మళ్లీ మొదలుపెడతానని.. 4 వేల కిలోమీటర్లను పాలేరులోనే పూర్తి చేస్తానని చెప్పారు. పాలేరులో వైఎస్సార్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు.
YS Sharmila Unveiled YSR Statue: పాలేరు పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహాన్ని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇదే పాలేరు మట్టి సాక్షిగా మాట ఇచ్చానని.. వైఎస్సార్ పాలన పాలేరు గడ్డమీద ప్రతి ఒక్కరికీ అందిస్తానని అన్నారు. మళ్లీ చెబుతున్నా.. వైఎస్సార్ పాలన ప్రతి గడపకు చేరుస్తానన్నారు. ఈ పాలేరు గడ్డకు నమ్మకంగా సేవ చేస్తానని చెప్పారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర మళ్లీ కొనసాగుతుందని తెలిపారు. ఈ పాలేరు నియోజకవర్గంలోనే పాదయాత్ర కొనసాగుతుందన్నారు.
"అతి త్వరలోనే పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 4 వేల కిలోమీటర్ల ప్రస్థానం ఇక్కడే పాలేరు గడ్డ మీదనే పూర్తి చేస్తాం.. పాలేరులో ప్రతి గడపను కలుస్తా.. పాలేరు గడ్డ వైఎస్సార్ బిడ్డకు అడ్డా.. మీ వైఎస్సార్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి వర్గాన్ని గుండెల్లో పెట్టుకున్న మహనీయుడు వైఎస్సార్. మంచి నాయకుడు కాబట్టే మహా నాయకుడు అయ్యాడు. ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలు ఈ దేశానికే ఆదర్శం..
ఇదే పాలేరు మట్టి సాక్షిగా పాలేరు ప్రజలకు వైయస్ఆర్ సంక్షేమ పాలన అందిస్తానని మాటిచ్చాను. రైతులకు అండగా నిలబడతానని, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తానని, పేద బిడ్డల ఫీ రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీలతో రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొస్తానని చెప్పాను. మళ్లీ చెబుతున్నా.. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను.. పులి కడుపున పులే పుడుతుంది.. మీ బిడ్డగా మీకు నమ్మకంగా సేవ చేస్తా. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరుస్తానని మాటిస్తున్నా.." అని వైఎస్ షర్మిల అన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మొదటిసారి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై వైఎస్ షర్మిల స్పందించారు. రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను స్మరించుకుంటూ మీరు చూపిన ఆప్యాయతకు ధన్యవాదాలు అని అన్నారు. రాహుల్ గాంధీ న్యాయకత్వంలో ఈ దేశానికి ఉజ్వల భవిష్యత్‌కు ఉంటుందని నమ్మిన వ్యక్తి వైఎస్సార్ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత కలిగిన నాయకుడుగా తెలుగు ప్రజలకు ఎంతో సేవ చేసిన నాయకుడు వైఎస్సార్ అని చెప్పారు. వైఎస్సార్ తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ఈ దేశానికి ఆదర్శం అని అన్నారు. వైఎస్సార్ మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు అని అన్నారు.
Also Read: Happy Birthday Sourav Ganguly: సౌరవ్ గంగూలీ బర్త్ డే స్పెషల్.. దాదా కెరీర్‌లో మర్చిపోలేని వివాదాలు
Also Read: HDFC Bank Interest Rates: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ.. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం..! ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి