Road Accident In Warangal: వరంగల్‌ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు ఘటన స్థలంలోనే మృతి చెందగా.. మరోకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వరంగల్‌ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను.. ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆటో డ్రైవర్‌తోపాటు మరో నలుగురు మృత్యువాత పడ్డారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వగా.. ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయింది. లారీ రాంగ్‌రూట్‌లో వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఘటన స్థలంలో నలుగురు మరణించినట్లు గుర్తించగా.. గాయపడిన ముగ్గురిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరో వ్యక్తి మరణించాడు. బాధితులను తేనే విక్రయించే కూలీలుగా పోలీసులు గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన డ్రైవర్ మద్యం మత్తులో లారీని నడపడమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Also Read: AP Politics: వచ్చే ఎన్నికల్లో పోటీపై బాలినేని ప్రకటన.. జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా..?  


Also Read: Shilpa Shetty: చెప్పులు ధరించి జాతీయ జెండాను ఎగురవేసిన శిల్పాశెట్టి.. నెట్టింట ట్రోలింగ్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook