Outer Ring Rail Project in Telangana: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రాక నేపథ్యంలో ఆదివారం వరంగల్‌లో ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అనంతరం హన్మకొండలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, జాతీయ రహదారుల అభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పనకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని... దేశంలోనే మొదటి సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసింది వరంగల్ రొడ్డే అని గుర్తుచేసుకున్నారు. వెయ్యి స్తంభాల గుడి మండపం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో వెయ్యి కళ్యాణ మండపం పూర్తి స్థాయిలో రిపేర్ చేస్తున్నాం అని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న 10 జిల్లాలను కలుపుకుని RRR రింగ్ రోడ్డు నిర్మాణం జరగనున్న నేపథ్యంలో ఆ పనులను వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా భూ సేకరణ కోసం 500 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది అని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిర్మాణం కోసం అయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్న కిషన్ రెడ్డి.. రూ.26 వేల కోట్లతో రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం కోసం నిధులు కేటాయించింది అని తెలిపారు. భూసేకరణ పూర్తి అయిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. కేంద్రం రూ.500 కోట్లు భూ సేకరణ కోసం కేటాయించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఒక్కరూపాయి కూడ ఇవ్వలేదు అని రాష్ట్ర ప్రభుత్వం వైపు వేలెత్తి చూపించారు. ఔటర్ రింగ్ రైల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాం. రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా అన్ని రైల్వే లైన్‌లకు అనుసందానం చేస్తూ ఔటర్ రింగ్ రైల్ ఏర్పాటు చేయనున్నాం. ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించేందుకు సర్వే చేసేందుకు సైతం కేంద్రం నిధులు కేటాయించింది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 


హైదరాబాద్ నుంచి యాదాద్రి వెళ్లే భక్తులతో పాటు నిత్యం పనులపై యాదాద్రి - హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే ప్రజల సౌకర్యార్థం యాదాద్రి వరకు 330 కోట్లతో MMTS రైలును విస్తరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వాట ఇవ్వకపోవడంతో ఎంఎంటీఎస్ విస్తరణ ఆలస్యం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోయినప్పటికీ.. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పెద్ద మనసుతో కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నిధులు వెచ్చించి మరీ నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావడం గొప్ప విషయం అని కేంద్రాన్ని కొనియాడారు. 


కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో రైల్వే ఓవరాయిలింగ్ యూనిట్‌తో పాటు వ్యాగన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాం. రోజుకు 200 వ్యాగన్లు తయారు చేసే సామర్ధ్యం కలిగిన ఈ పరిశ్రమకు సంభందించిన పూర్తి వివరాలు ప్రధాన మంత్రి ఆదేశాలతో వెల్లడిస్తాం. వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో వ్యాగాన్ తయారీ పరిశ్రమ ప్రధాన మంత్రి ఇచ్చారు. దీనికి భూమి పూజ చేసి స్వయంగా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి : Rs 4000 Old Age Pension: తెలంగాణలో రూ. 4 వేల వృద్ధాప్య పెన్షన్.. బీఆర్ఎస్‌కి గట్టి దెబ్బ పడనుందా ?


587 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 1127 కోట్లతో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ హైవేకు శంకుస్థాపన చేయనున్నారు. 5587 కోట్లతో నిర్మించే జాతీయ రహదారుల నిర్మాణం పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అభివృద్ధితో పాటు చారిత్రాత్మక ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. తెలంగాణ అభివృద్ది కోసం చిత్తశుద్ధితో కేంద్రం కృషి చేస్తున్న కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తోంది అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.


ఇది కూడా చదవండి : Revanth Reddy speech highlights: ఖమ్మం జనగర్జన సభలో రేవంత్ రెడ్డి స్పీచ్ హైలైట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK