AP Assembly Session: అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామా చేయాలని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సూచించారు. జగన్‌తోపాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే పదవుల్లో ఉండడం ఎందుకు? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలుగా ఉన్న వారంతా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని పరోక్షంగా సూచించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu: దళితులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్‌.. ఏం చెప్పారో తెలుసా?


ఈనెల 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండగా తాను వాటికి హాజరుకాలేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. 'అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా అక్కడకు వెళ్లి ఏమీ ప్రయోజనం? అందుకే అసెంబ్లీ సమావేశాలకు తాను వెళ్లడం లేదు' అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై మచిలీపట్నంలో ఓ కార్యక్రమానికి హాజరైన వైఎస్‌ షర్మిల పైవిధంగా మాట్లాడారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మన్‌ శొంఠి నాగరాజు ప్రమాణస్వీకారానికి హాజరై షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: YS Sharmila: వర్రా రవీంద్రా రెడ్డి అనే సైకో నా పుట్టుకను అవమానించాడు: వైఎస్‌ షర్మిల


'బీసీ బిడ్డ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడం గర్వకారణమే కానీ బీసీలు మాత్రం గర్వంగా లేరు. బీసీ ప్రధాని అయినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. 2017లో బీసీల కులగణన చేస్తామని చెప్పి ఇప్పటివరకు చేయలేదు. బీజేపీకి బీసీల పట్ల ప్రేమ లేదు' అని వైఎస్‌ షర్మిల విమర్శించారు. బీజేపీ అగ్రకుల పార్టీ అని.. అదానీ, అంబానీలకు.. కార్పొరేట్ వాళ్లకు కొమ్ముగాసే పార్టీ అని పేర్కొన్నారు. బీసీలు అంటే మోడీకి ఓట్లు వేసే యంత్రాలు మాత్రమేనని తెలిపారు.


'సీఎం చంద్రబాబుకు కూడా బీసీల మీద ప్రేమ లేదు. వైఎస్ఆర్ బీసీల మనిషి అయితే.. చంద్రబాబు బీసీల ద్రోహి' అని వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. 10 సూత్రాలతో బీసీల మాస్టర్ ప్లాన్.. మాది బీసీల పార్టీ.. 40 ఏళ్ల నుంచి టీడీపీనీ మోస్తుంది బీసీలు అని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తానన్నారన్నారు మరి ఏమైందని నిలదీశారు. 'బీసీల అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ సూపర్ మోసం చేస్తున్నారు. వచ్చిన 5 నెలల్లోనే విద్యుత్ బిల్లులను రూ.17 వేల కోట్లు ప్రజలపై మోపారు' అని వాపోయారు. 


'బీజేపీ కూడా రాష్ట్రానికి ఇచ్చేది గుండు సున్నా. ఇచ్చిన హామీలు అన్ని పక్కన పెట్టారు. హోదా లేదు... నిధులు లేవు. అయినా చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం దారుణం. బీజేపీకి పదేళ్లుగా బాబు, జగన్ ఊడిగం చేస్తున్నారు. జగన్ కూడా బీసీలను మోసం చేశారు' అని షర్మిల తెలిపారు. 'బీసీల అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం. బీసీలకు న్యాయం జరగాలి అంటే కుల గణన జరగాలి' అని పేర్కొన్నారు. ఏపీలో కూడా కులగణన జరిపించాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులగణన కావాలని అడిగి ఇప్పుడు ఏమైంది?' అని షర్మిల ప్రశ్నించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి