116 Year Japanese Woman Guinness World Record: సాధారణంగా ఈ కాలంలో ఎవరి జీవితకాలం అయినా మహా అంటే మనదేశంలో 60 ఏళ్లు. ఏ రోగాలు చుట్టుముట్టకుండా ఉంటే 80. దీనికి మించి బతకడం అంటేనే ఓ అద్భుతంగా చూస్తారు. మంచి లైఫ్‌స్టైల్‌ అనుసరిస్తే మరికొన్ని సంవత్సరాలు ఎక్కువగా బతుకుతారు. అయితే, సెంచరీ కొట్టడం కూడా కష్టమే. కానీ ఓ జపనీస్‌ బామ్మ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 116 ఏళ్ల కలిగిన ఈ జపనీస్‌ మహిళ ఎక్కువ కాలం బతికిన వ్యక్తిగా అరుదైన గిన్నీస్‌ బుక్‌లో స్థానం సంపాదించుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టోమికో ఇటూక ఈమె జపాన్‌లోని అషియాలో ఉంటున్నారు. ఈ బామ్మ వయస్సు 116 ఏళ్లు. అందుకే ఈ జపనీస్‌ బామ్మ అధికారికంగా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇటీవల 117 ఏళ్ల మరియా బ్రన్యాస్‌ మొరేరా చనిపోయిన తర్వాత టోమికో ఇటూకా అనే ఈ జపనీస్‌ బామ్మకు ఆ రికార్డు లభించింది. గెరొంటాలజీ రీసెర్చ్‌ గ్రూప్‌ ఆమె వయస్సును ధ్రువీకరించింది. ఇటూకా పుట్టిన తేదీ సంవత్సరం ఆధారంగా వరల్డ్‌ సూపర్‌సెంటెనేరియన్‌ ర్యాంకింగ్‌ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.


ఇటూకా అనే ఈ జపనీస్‌ బామ్మ 1908 మే 23వ తేదీలో జన్మించారు. ఆమె 110 ఏళ్ల వయస్సు వరకు తన ఇద్దరు కూతుళ్లతోపాటు ఉండేది. ప్రస్తుతం ఇటూకా బామ్మ అషియాలోని హ్యోగో ప్రీఫెక్చర్‌లో ఓ నర్సింగ్‌ హోమ్‌లో 2019 నుంచి ఉంటున్నారు. ఈ బామ్మకు తన రికార్డు గురించి చెప్పిన వెంటనే 'థ్యాంక్యూ'  అని చెప్పారట. అంటే ఆమె స్పష్టంగా ఇప్పటికీ కూడా వినగలుగుతున్నారు.


ఇదీ చదవండి:ఘోర విషాదం.. నదిలో పడిపోయిన బస్సు 14 మంది భారతీయుల మృతి!


ఇక ఇటూకాతోపాటు వారి తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం. ఈమె ఒసాకాలోని విద్యాభ్యాసం పూర్తిచేశారు. స్కూల్‌ సమయంలోనే యాక్టీవ్‌గా ఉండేవారట. అందుకే క్రీడల్లో కూడా బాగా రానించేవారు. ముఖ్యంగా వాలీబాల్‌ కూడా ఆడేవారట. ఈ బామ్మకు 20వ ఏటలో  వివాహం జరిగింది. నలుగురు సంతానం కూడా కలిగారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కూడా తన భర్తకు టెక్ట్స్‌ టైల్‌ ఫ్యాక్టరీకి సంబంధించిన పనుల్లో సహాయం చేసేవారట.అయితే, బామ్మగారి భర్త 1979లో మరణించారు. 


ఇదీ చదవండి:ఎయిర్‌ఫోర్స్‌ కాదు రైల్‌ఫోర్స్‌.. ప్రధాని మోదీ ప్రయాణించనున్న అత్యాధునిక లగ్జరీ ట్రైన్‌ ఫీచర్లు ఇవే..


ముఖ్యంగా ఈ బామ్మ ఇన్ని రోజులపాటు బతకడానికి ప్రధాన కారణం నడక. ఎక్కువగా నడక మార్గాన్నే ఎంచుకునేవారు.దీనివల్ల ఆరోగ్యంగా ఉంటామని నమ్ముతారు. అందుకే ఈ బామ్మ మౌంట్‌ ఓన్‌టక్‌ ను కూడా రెండుసార్లు అధిరోహించారు. దీని ఎత్తు 3000 మీటర్లు.అందుకే అక్కడి సైగోకు కన్నాన్‌ యాత్రను కూడా ఆమె 80 వయస్సులో వెళ్లారు. ఇక అషియా యాత్రను సెంచరీ కొట్టాక ఎక్కారట.మూడు నెలల కిందటే 116వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఇటూకాకు ఈ సందర్భంగా సిటీ మేయర్‌ కూడా కేక్‌, బొకే కూడా పంపించారట. ఆమె చుట్టు పక్కల ఉన్నవారికి ఇప్పటికీ త్వరగా రెస్పాండ్‌ అవ్వడం ఆశ్చర్యం కల్పిస్తోంది.ఈమె ఇలా రికార్డు కొట్టిన 24వ వ్యక్తి.
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.