Indonesia explosion: నికెల్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 13 మంది కార్మికులు దుర్మరణం..
Indonesia explosion today: ఇండోనేషియాలోని ఓ నికెల్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 38 మంది గాయపడ్డారు.
Nickel plant explosion in Indonesia: ఇండోనేషియాలో పెను విషాదం చోటుచేసుకుంది. సులావేసి ఐలాండ్ లో చైనాకు చెందిన ఓ నికెల్ ప్లాంట్‌లో భారీ పేలుడు (Nickel plant explosion in Indonesia) జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 38 మంది గాయపడ్డారు. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకు ఈ దుర్ఘటన సంభవించింది. మృతి చెందిన వారిలో 8 మంది ఇండోనేషియావాసులతో పాటు ఐదుగురు చైనా కార్మికులు కూడా ఉన్నారు. ఈ విషాద ఘటన సెంట్రల్ సులావెసి రాష్ట్రంలోని మొరోవాలి ఇండస్ట్రియల్ పార్క్‌లో ఉన్న పీటీ ఐటీఎస్ఎస్ ప్లాంట్‌లో జరిగింది.
ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను స్థానికి ఆసుపత్రికి తరలించారు. కొన్ని గంటలపాటు తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పేలుడుకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన అధికారులు పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్లాంట్‌లోని ఓ ఫర్నేస్‌కు మరమ్మత్తులు చేస్తుండగా.. ఓ ఫ్లేమబుల్ లిక్విడ్కి సడన్ గా మంటలు అంటుకున్నాయి. అవి క్రమంగా పక్కనే ఉన్న ఆక్సిజన్ ట్యాంక్ కు వ్యాపించి ట్యాంక్ పేలిపోయింది. ఈ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Also Read: Republic Day 2024: గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook