Extremely Rare Case: అత్యంత అరుదైన ఘటన.. ఆ యువతికి జన్మించిన కవలలకు ఇద్దరు తండ్రులు.. వైద్యులే షాక్..
Extremely Rare Case: బ్రెజిల్‌కి చెందిన ఓ యువతికి జన్మించిన కవలలకు బయాలజికల్ ఫాదర్స్ వేరుగా ఉండటం వైద్యులనే ఆశ్చర్యపోయేలా చేసింది.
Extremely Rare Case: బ్రెజిల్‌లో అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్ల ఓ యువతి ఇద్దరు కవలలకు జన్మనివ్వగా.. ఆ ఇద్దరి తండ్రి ఒకరే కాకపోవడం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఇద్దరిలో ఒకరు ఒకరికి, మరొకరు ఇంకొకరికి పుట్టినట్లు తేలింది. కవలలకు ఇద్దరు వేర్వేరు బయాలజికల్ ఫాదర్స్ ఉండటం అత్యంత అరుదని.. 10 లక్షల కేసుల్లో ఒక కేసు మాత్రమే ఇలా ఉండేందుకు అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు.
బ్రెజిల్‌లోని మినెరియోస్‌కి చెందిన ఆ అమ్మాయి 16 నెలల క్రితం కవలలకు జన్మనిచ్చింది. అయితే ఆ పిల్లల తండ్రి ఎవరనే విషయంలో ఆమెకు సందేహం ఉంది. పిల్లలకు జన్మనివ్వడానికి 9 నెలల ముందు.. ఒకానొక రోజు ఒకేరోజు ఆమె ఇద్దరు వేర్వేరు వ్యక్తులతో శృంగారంలో పాల్గొన్నది. ఆ తర్వాత 9 నెలలకు కవలలకు జన్మనిచ్చింది. తాను ఇద్దరితో శృంగారంలో పాల్గొనడంతో ఆ ఇద్దరిలో కవలల తండ్రి ఎవరో తెలుసుకోవాలనుకుంది. మొదట ఆ ఇద్దరిలో ఒకరి డీఎన్ఏ శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయించింది. ఆ శాంపిల్స్ కవలల్లో ఒకరికే సరిపోలాయి. మరో బేబీ డీఎన్ఏ అతని డీఎన్ఏకి మ్యాచ్ అవలేదు. దీంతో తనతో శృంగారంలో పాల్గొన్న రెండో వ్యక్తిని కూడా పిలిపించి డీఎన్ఏ టెస్టులు చేయించారు.
అతని డీఎన్ఏ కవలల్లో రెండో బేబీకి సరిపోయింది. దీంతో ఆ కవలల బయాలజికల్ ఫాదర్స్ వేరు అని నిర్ధారణ అయింది. చూడటానికి ఒకేలా ఉన్న తన కవలలు ఇద్దరు వేర్వేరు బయాలజికల్ ఫాదర్స్‌ను కలిగి ఉండటం తనను ఆశ్చర్యపరిచిందని ఆ తల్లి పేర్కొంది. ఇది అరుదైన సంఘటనే కానీ ఇలా జరగడం అసాధ్యమేమీ కాదని వైద్యులు చెబుతున్నారు. సైన్స్ పరిభాషలో దీన్ని 'హెటిరోపేరెంటల్ సూపర్‌ఫికండేషన్' అంటారని తెలిపారు. అంటే, తల్లి నుంచి విడుదలయ్యే రెండు అండాలు ఇద్దరు వేర్వేరు వ్యక్తుల శుక్ర కణాలతో ఫలదీకరణం చెందినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఇలాంటి కేసులు మరో 20 మాత్రమే ఉండి ఉంటాయని అన్నారు.
Also Read: Yashoda Teaser: గర్భవతిగా సమంత.. చేయోద్దన్న పనే చేయడంతో?
Also Read: Balapur Ganesh Laddu: పోటాపోటీగా సాగిన వేలంపాట.. రికార్డు ధర పలికిన బాలపూర్ లడ్డూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook