Blast in istanbul: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. మరో 81 మంది గాయపడ్డారు. నగరంలోని ఇస్తిక్‌లాల్ అవెన్యూ వద్ద ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలికి  చేరుకున్న అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసుల సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు (Explosion Istanbul Street) జరిగిన వెంటనే ప్రజలు భయంతో పరుగులు తీశారు. దుకాణాలను మూసివేశారు. ఈ మార్కెట్ ప్రాంతం పర్యాటకులు, స్థానికులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. నేరస్తులను గుర్తించేందుకు భద్రతాబలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ బాంబు పేలుడు ఘటనను టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌ ఖండించారు. ఉగ్రదాడిగా అనుమానిస్తున్నట్లు ఆయన తెలిపారు. . ఆత్మాహుతి బాంబర్ ఈ దాడికి పాల్పడ్డాడని టర్కీ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. "నేను 50-55 మీటర్లు దూరంలో ఉన్నాను, అకస్మాత్తుగా పేలుడు శబ్దం వచ్చింది. నేను ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులను నేలపై చూశాను" అని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. 2015-2016లో ఇస్తాంబుల్‌ను లక్ష్యంగా చేసుకున్న దాడుల్లో గతంలో ఇస్తిక్‌లాల్ స్ట్రీట్ దెబ్బతింది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ చేసిన ఈ దాడుల్లో దాదాపు 500 మంది మరణించగా, 2,000 మందికి పైగా గాయపడ్డారు.


Also Read: Dallas Airshow: డల్లాస్ ఎయిర్‌ షోలో విషాదం.. ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు.. వీడియో వైరల్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి