24 గంటల్లో 6,414 మంది మృతి, 15 లక్షలు దాటిన Corona కేసులు
కరోనా మహమ్మారి నిమిషానికి కొన్ని ప్రాణాల (CoronaVirus Deaths) చొప్పున బలిగొంటుంది. 200కు పైగా దేశాలు ప్రాణాంతక వైరస్‌తో పోరాడుతున్నాయి
Corona virus Deaths: కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. కరోనా మహమ్మారి నిమిషానికి కొన్ని ప్రాణాల చొప్పున బలిగొంటుంది. 200కు పైగా దేశాలు ప్రాణాంతక వైరస్‌తో పోరాడుతున్నాయి. అయితే గత 24 గంటల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 6,414 మంది చనిపోవడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 15,18,518కు చేరుకుంది. ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు రెండూ ఒకటి కాదా.. ఇది చదవండి
ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా శ్రమించినా కరోనా మహమ్మారికి సరైన మందును ఏ దేశం కనిపెట్టలేకపోతోంది. మరోవైపు కరోనా బారిన పడి ఇప్పటివరకూ 88,495 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బాధితులలో 330,589 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. పతనమైన బంగారం ధరలు.. అదే దారిలో వెండి
17,669 మరణాలతో ఇటలీ అగ్రస్థానంలో ఉండగా, కరోనా కేసులు అత్యధికంగా అమెరికాలో 434,927 నమోదయ్యాయి. అమెరికా 14,788 మరణాలు, స్పెయిన్ 14, 792, ఫ్రాన్స్ 10,869, బ్రిటన్ 7,097, చైనా 3,335 కరోనా మరణాలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ