Indonesia Earthquake: ఇండోనేషియా తూర్పు ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. బండా సముద్రంలో ( Banda Sea ) గురువారం 7.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన బందన్​ వాతావరణ, భౌగోళిక ఏజెన్సీ(బీఎంకేజీ) ప్రకటించింది. అయితే సునామీ హెచ్చరికలేవీ జారీ చేయలేదన్నారు. ఈ భూప్రకంపనలకు మలుకు రాష్ట్రంలోని నైరుతి ప్రాంతంలో రెండు ఇళ్లు కుప్పకూలాయి. ఇంకొన్ని ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలుకు ఫ్రానిన్స్ (Maluku province) లోని తియకుర్​ నగరానికి 132 కిలోమీటర్లు దూరంలో అర్ధరాత్రి 1.25 సమయంలో సముద్రంలో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. సముద్రగర్భంలో 183 కిలోమీటర్లు లోతులో భూకంప కేంద్రాన్ని (epicenter) గుర్తించారు. అయితే సునామీకి (Tsunami) ఎలాంటి ఆస్కారం లేదని పేర్కొన్నారు. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Also Read: California Earthquake: కాలిఫోర్నియాలో తీవ్ర భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదు


ఇండోనేషియా 'పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్'లో ఉండటం వల్ల తరుచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు ఏర్పడతాయి.  2004 డిసెంబరు 26 ఇండోనేషియాలో 9.1 తీవ్రత భారీ భూకంపం (Earthquake) సంభవించి సునామీకి దారితీసింది. ఈ సునామీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2.20 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. ఒక్క ఇండోనేషియాలోనే 1.70 లక్షల మంది చనిపోయారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook