California Earthquake: అగ్రరాజ్యం అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రతకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాలిఫోర్నియా కేంద్రంగా సంభవించిన భూప్రకంపనలు కలకలం రేపాయి.
కాలిఫోర్నియా రాష్ట్రంలో భారీగా భూకంపం సంభవించింది. అమెరికాలో జియోలాజికల్ సర్వే డేటా ప్రకారం ఉత్తర కాలిఫోర్నియా తీరంలో 6.2 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. అయితే సునామీ ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు. హంబోల్ట్ కౌంటీకి సమీపంలో ఉన్న కేప్ మెండోసినో వద్ద భూకంపం సంభవించినట్టు యూఎస్ జియాలాజికల్ సర్వే తెలిపింది. కాలిఫోర్నియాలో వచ్చిన భూ ప్రకంపనల ప్రభావం...శాన్ ఫ్రాన్సిస్కో వరకూ కన్పించిందని సమాచారం. గత 11 ఏళ్లలో ఇలాంటి భూకంపాన్ని ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. భూప్రకంపనలు భారీగా ఉండటంతో ప్రజలంతా భయభ్రాంతులై రోడ్లపైకి చేరారు.
అయితే ఈ భూకంపానికి(Earthquake)సంబంధిన ప్రమాద నష్టం గురించి ఇంకా వివరాలు అందాల్సి ఉంది. ఆస్థినష్టం ఏ మేరకు జరిగింది, ప్రాణనష్టం ఉందా లేదా అనే వివరాలు తెలియలేదు. చాలా ప్రాంతాల్లో ఇళ్లలో ఫర్నీచర్ ధ్వంసమైన ఘటనలున్నాయి. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం హంబోల్ట్ కౌంటీలోని కాలిఫోర్నియా లాస్ట్ కోస్ట్ ప్రాంతపు పెట్రోలియా పట్టణానికి పశ్చిమాన 39 కిలోమీటర్ల దూరంలో...పసిఫిక్ మహా సముద్రంలో భూకంపకేంద్రం ఉంది. అమెరికా కాలమానం ప్రకారం మద్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు భూకంపం సంభవించింది. 6.2 తీవ్రత(California Eathquake)కావడంతో సునామీ ఆందోళన రేగింది. అయితే అధికారులు ఆ ప్రమాదం లేదని తేల్చి చెప్పారు.
Also read: Philippines Rai Typhoon: ఫిలిప్పీన్స్‌లో 'రాయ్' బీభత్సం- 100 దాటిన మృతుల సంఖ్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook