Gaza fire incident: పుట్టిన రోజు వేడుకలో పెను విషాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి ఓ మూడంతస్తుల భవనంలోని పైఅంతస్తులో కుటుంబ సభ్యులంతా బర్త్‌ డే వేడుకల చేసుకుంటుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది సభ్యులతో సహా 21 మంది మరణించారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు  కూడా ఉన్నారు. ఈ ఘటన గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంలో (Jabalia refugee camp) చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇంట్లో నిల్వ చేసిన పెట్రోల్‌ (gasoline) వల్లే ప్రమాదం చోటుచేసుకొని ఉంటుందని గాజా అధికారులు భావిస్తున్నారు. గ్యాసోలిన్ ఎలా మండిందనే విషయంపై స్పష్టత లేదని, విచారణ జరుపుతున్నామని చెప్పారు. బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే వీరి డెడ్ బాడీస్ ను ఉత్తరగాజాలోని ఇండోనేషియా ఆస్పత్రిలో ఉంచారు. 


ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య వివాదం గురించి మనందరికీ తెలిసిందే. ఈ కారణంగానే గాజా ప్రాంతం నిత్యం బాంబుల మోతతో దద్దరిల్లుతుంది. ఈ వివాదం కారణంగా చెలరేగిన హింస కాకుండా గత కొన్నేళ్లలో అత్యంత ఘోరమైన సంఘటన ఇదేనని అధికారులు చెబుతున్నారు. ఫర్నిచర్‌ ఎక్కువగా ఉండటం వల్లే మంటలు తీవ్రత అధికంగా ఉన్నట్టు స్థానికులు పేర్కొన్నారు. 15ఏళ్ల కిందట ఇస్లామిక్ మిలిటెంట్ హమాస్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఇజ్రాయెల్-ఈజిప్టు సరిహద్దు దిగ్బంధనం కారణంగా గాజా తీవ్రమైన ఇంధన కొరతను ఎదుర్కోంటుంది. అందుకే ప్రజలు ఇళ్లలో వంట గ్యాస్‌ ,డీజిల్‌, పెట్రోల్‌ నిల్వ చేసుకుంటుంటారు.


Also Read: Iran Police Fire: మెట్రో స్టేషన్‌లో కలకలం.. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి