Stampede in Yemen: యెమెన్ లో  ఘోర విషాదం చోటుచేసుకుంది. రాజధాని సనాలో ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం సందర్భంగా జరినగిన తొక్కిసలాటలో 85 మంది మృతి చెందగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటన సనాలోని బాబ్ అల్-యెమెన్ జిల్లాలో జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా హుతీల నియంత్రణలో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంధువుల ఆచూకీ కోసం ప్రజలు సంఘటనా స్థలానికి తరలి రావడంతో భద్రతా బలగాలను ఆ ప్రాంతం చుట్టూ భారీగా మోహరించారు. వారిని లోపలికి అనుమతించలేదు. క్షతగాత్రులను సమీపంలో ఆస్పత్రులకు తరలించారు. కొంతమంది వ్యాపారులు డబ్బును స్థానిక అధికారులతో సమన్వయం లేకుండా పంపణీ చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని హుతీ యెుక్క అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒక పెద్ద కాంప్లెక్స్‌లో మృతదేహాలు నేలపై పడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. అధికారులు వీటిని ధృవీకరించలేదు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. 


Also Read: Karnataka Assembly Elections: బీజేపీకి మరో బిగ్ షాక్.. కీలక నేత గుడ్ బై


అరేబియా ద్వీపకల్పంలోని పేద దేశాల్లో యెమెన్ కూడా ఒకటి. 2014లో యెమెన్‌లో అంతర్యుద్ధం జరిగింది. ఇరాన్-మద్దతుగల హుతీ తిరుగుబాటుదారులు సనాను స్వాధీనం చేసుకుని పరిపాలన చేస్తున్నారు. యూఎన్ ప్రకారం, యెమెన్ జనాభాలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. ఈ ఏడాది 21.7 మిలియన్ల మందికి అంటే దేశంలో మూడింట రెండొంతుల మందికి మానవతా సహాయం కావాలని యూఎన్ తెలిపింది. చాలా సంవత్సరాలుగా అక్కడి అధికారులు జీతాలు ఇవ్వడం లేదు. 


Also Read: Fire Accidents: రెండు అగ్ని ప్రమాదాల్లో 32 మంది మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook