ఒకే ఒక్కడు ( Oke okkadu movie ) సినిమా కాదిది. సినిమాలో అర్జున్ ( Arjun ) లేదా అనిల్ కపూర్ ( Anil kapoor ) అంతకంటే కాదు. అలాగని మేక్ ఎ విష్ ( Make a Wish ) కార్యక్రమం కూడా కాదు. నిజంగా దేశానికి ప్రధానిగా ఒక్కరోజు వ్యవహరించిందామె. ఎక్కడ జరిగింది..ఎవరామె?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఫిన్లాండ్ ( Finland ) ఉత్తర యూరోపియన్ దేశం ( North European country ). మానవ హక్కుల పరిరక్షణ, లింగ సమానత్వ సాధన, మహిళా సాధికారత ముందంజలో ఉన్న దేశమిది. ఇప్పుడు హఠాత్తుగా వార్తలకెక్కింది. దీనికి కారణం ఒకే ఒక్కడు సినిమా సన్నివేశం లాంటిదే నిజంగా జరిగింది ఈ దేశంలో. సినిమా కానే కాదు. అచ్చం సినిమాలో జరిగినట్టే ఏకంగా దేశానికి ఒక్కరోజు ప్రధానమంత్రిగా పనిచేసి వార్తల్లోకెక్కారు ఆమె. 


ఆమె పేరు అవా ముర్టో ( Ava Muerto ). వయస్సు కేవలం 16 ఏళ్లు. ఒక్కరోజు దేశానికి ప్రధానిగా పూర్తిస్థాయిలో పరిపాలనా బాధ్యతలు చేపట్టారు. సినిమాలో జరిగినట్టు ఛాలెంజ్ లు జరగలేదు. అలాగని మేక్ ఎ విష్ లాంటి కార్యక్రమం అంతకంటే కాదు.  ఇప్పటికే 34 ఏళ్ల ప్రాయంలో ప్రదానిగా బాధ్యతల స్వీకరించడం ద్వారా అతి చిన్న వయస్సులో అత్యున్నత పదవి చేపట్టిన మహిళగా ఖ్యాతి గాంచిన ఫిన్ లాండ్ ప్రదానమంత్రి సనా మారిన్ ( Finland prime minister Sanna marin ) స్వయంగా...ఈ 16 ఏళ్ల బాలిక అవా ముర్టోను ఆ పదవిలో కూర్చోబెట్టి..తాను ఓ రోజు విశ్రాంతి తీసుకున్నారు. 


వాస్తవానికి గర్ల్స్ టేకోవర్ ( Girls Takeover )  పేరుతో ప్లాన్ ఇంటర్నేషనల్ ( Plan international ) అనే సంస్థ పలు రంగాల్లో బాలికల్ని ప్రోత్సహించే దిశగా పని చేస్తోంది. బాలికల్లో నైపుణ్యత, ఐటీ రంగంలో అవకాశాల్ని పెంచడం, మహిళలపై ఆన్ లైన్ వేధింపుల సమస్యను ఫోకస్ చేయడం లాంటివి గర్ల్స్ టేకోవర్ క్యాంపెయిన్ లో ప్రదానాంశాలు. ఇందులో భాగంగానే Finland ప్రధాని సనా మారిన్..16 ఏళ్ల అవా ముర్టోకు ప్రధానిగా పనిచేసే అవకాశాన్ని కల్పించారు. 


ఒక్కరోజంతా ఫిన్లాండ్ దేశ ప్రధానిగా ( One day pm for Finland ) పనిచేసిన అవా ముర్టో తన అనుభవాల్ని మీడియాతో పంచుకున్నారు. పాలనలో ఇబ్బందులు, ప్రధాని హోదాలో రోజంతా ఉత్కంఠగా గడిచిందని చెప్పారు. పరిపాలనకు సంబంధించి కొన్ని క్లిష్టమైన విషయాలు తెలుసుకున్నానని.. ఛాన్సలర్, మంత్రులు, ఉన్నతాధికారులతో విడివిడిగా సమీక్షా సమావేశాలు నిర్వహించానన్నారు.  అభివృద్ది, విదేశీ వాణిజ్యంపై పలు సూచనలు చేశానని తెలిపారు. వాస్తవానికి రాజకీయ నేతలు మరింత సృజనాత్మకతతో సరికొత్తగా ఆలోచించడానికి టీనేజర్ల సలహాలు, సూచనలు పనికొస్తాయనేది తన అభిప్రాయమన్నారు. ఒక్క రోజు ప్రధానిగా బాగానే పని చేశాననుకుంటున్నానని... భవిష్యత్తులో పూర్తికాలం ప్రధానిగానూ అవుతానేమో'నంటూ నవ్వి పారేశారు అవా ముర్టో. Also read: Covid passport: ప్రపంచంలోనే తొలిసారిగా కామన్ పాస్ యాప్