Covid passport: ప్రపంచంలోనే తొలిసారిగా కామన్ పాస్ యాప్

కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో ఓ దేశం నుంచి మరో దేశం వెళ్లడానికి భయపడుతున్నారా? కోవిడ్ సంక్రమణ లేదా క్వారెంటైన్ భయం ఉందా? అయితే మీ కోసం ప్రత్యామ్నాయం వస్తోంది. అదే ప్రపంచంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతున్న కోవిడ్ passport .

Last Updated : Oct 7, 2020, 10:40 PM IST
Covid passport: ప్రపంచంలోనే తొలిసారిగా కామన్ పాస్ యాప్

కరోనా వైరస్ ( Coronavirus ) సంక్రమణ నేపధ్యంలో ఓ దేశం నుంచి మరో దేశం వెళ్లడానికి భయపడుతున్నారా? కోవిడ్ సంక్రమణ లేదా క్వారెంటైన్ భయం ( Quarantine Fear ) ఉందా? అయితే మీ కోసం ప్రత్యామ్నాయం వస్తోంది. అదే ప్రపంచంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతున్న కోవిడ్ passport .

కరోనా వైరస్ భయం నేపధ్యంలో దేశీయంగా ప్రయాణాలు చేయడానికే భయపడిపోతున్నారు. అటువంటిది అంతర్జాతీయ ప్రయాణాల పరిస్థితి మరీనూ. ఓ దేశం నుంచి మరో దేశం వెళ్లేందుకు విమాన ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు కరోనా వైరస్ సంక్రమణ భయం..మరోవైపు క్వారెంటైన్ భయం. కనీసం పది నుంచి పదిహేను రోజులు స్వీయ నిర్బంధంలో ఉండిపోవల్సి వస్తుంది. అందుకే పరిష్కారమార్గంగా క్యాథె పసిఫిక్‌ ఎయిర్ లైన్స్ ( Cathay airlines )..యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్ ( United airlines )‌  కలిసి సంయుక్తంగా ఓ ఉపాయాన్ని కనుగొన్నాయి. 

ఈ రెండు ఎయిర్ లైన్స్ కలిసి కామన్ పాస్ ( Common pass app ) పేరుతో ఓ యాప్ అభివృద్ధి చేశాయి. ఈ యాప్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. విమానాల్లో అంతర్జాతీయ ప్రయాణాలు చేయడానికి ముందు ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్‌19 నిర్ధారణ పరీక్షలు ( Covid19 Test ) చేయించుకుని ఆ వివరాల్ని ఈ యాప్‌ ద్వారా స్టోర్ చేసుకోవాలి. ఇక ఏ విమానాశ్రయంలోనైనా సంబంధిత అధికారులు అడిగినప్పుడు మొబైల్‌ ఫోన్లో ఈ యాప్‌ను ఓపెన్‌చేసి చూపిస్తే సరిపోతుంది.  ఈ సరికొత్త ప్రయోగాన్ని ఈ వారం నుంచి హీత్రూ విమానాశ్రయంలో పరిశీలించనున్నారు. ప్రపంచ దేశాల్లోని వివిధ ప్రభుత్వాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కామన్స్‌ ప్రాజెక్ట్‌ ఫౌండేషన్‌ వివిధ భాషల్లో ఈ యాప్‌ను తయారు చేసింది. ఈ యాప్‌కు  ఉండే క్యూఆర్‌ కోడ్‌ను విమానాశ్రయ సిబ్బంది, సరిహద్దు భద్రతా సిబ్బంది స్కాన్‌ చేస్తే వివరాలు తెలుస్తాయి. 

హీత్రూ విమానాశ్రయం ( Heathrow Airport ) లో ఈ ప్రయోగం సఫలమైతే..క్రమంగా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఇండియాలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక వంటి కొన్ని రాష్ట్రాలు స్పందన వంటి యాప్ ల ద్వారా ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి ప్రవేశించేటప్పుడు ప్రవేశపెట్టిన పాస్ లకు ఇది కాస్త అడ్వాన్స్డ్ వెర్షన్. Also read: Kerala Gold Scam: చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x