Ukraine Theatres: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఓ వైపు కొనసాగుతూనే ఉంది యుద్ధ పరిస్థితుల్లోనే రాజధాని నగరం కీవ్‌లో థియేటర్ తెర్చుకుంది. కిటకిటలాడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాలుగు నెలల్నించి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉంది. ఉక్రెయిన్‌లోని కొన్ని నగరాలు రష్యా ఆధీనంలో వెళ్లిపోగా..ఇంకొన్ని నగరాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తొలుత రష్యా స్వాధీనంలో వెళ్లే పరిస్థితుల్లో ఉన్నా..ఆ తరువాత ఉక్రెయిన్ సేనల ప్రతిదాడులతో రష్యా బలగాలు వెనుదిరిగాయి. ఇప్పుడు కీవ్ నగరంలో పరిస్థితి నెమ్మదిగా కుదుటపడుతోంది. రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. సినిమా థియేటర్లు, ఒపెరా ప్రదర్శనలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి...


ఈ నేపధ్యంలోనే కీవ్ శివారులోని పొదిల్‌లో ఉన్న ఓ థియేటర్ ప్రదర్శన ప్రారంభించింది. ప్రేక్షకులు వస్తారో రారో అనే సందిగ్దత మధ్య థియేటర్ ప్రారంభమైంది. అయితే అనూహ్యంగా..తొలిరోజే..టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. ఎన్ని ఇబ్బందులు, సంక్లిష్ట పరిస్థితులున్నా జీవన ప్రయాణం, రోజువారీ కార్యక్రమాలు కొనసాగించాల్సిందేననేది సగటు ఉక్రెయిన్ పౌరుడి అభిప్రాయంగా ఉంది. నాలుగు నెలల్నించి యుద్ధ పరిస్థితులతో విసిగిపోయిన ఉక్రెయిన్ పౌరులు..రిలాక్సేషన్ కోసం థియేటర్ తెర్చుకోగానే ఆ బాటపట్టారు. మరోవైపు ఉక్రెయిన్‌లో మరిన్ని ప్రాంతాల్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో రష్యా నిమగ్నమైంది. డాన్‌బాస్ ప్రాంతాన్ని పూర్తిగా వశపర్చుకునేందుకు భావిస్తోంది. సీవీరోదొనెట్స్క్ నగరాన్ని టార్గెట్ చేసింది. ఇంకోవైపు ఉక్రెయిన్ సైనికులకు మద్దతుగా..పశ్చిమ దేశాలు మద్దతిస్తున్నాయి. 


Also read: Nigeria Church Attack: నైజీరియాలో చర్చిపై ఉగ్ర దాడి.. 50 మంది మృతి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook