Nigeria Church Attack: నైజీరియాలో చర్చిపై ఉగ్ర దాడి.. 50 మంది మృతి!

At least 50 people dead in Nigeria Church Attack. నైజీరియాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుళ్లలో భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 6, 2022, 09:38 AM IST
  • నైజీరియాలో చర్చిపై ఉగ్ర దాడి
  • 50 మంది మృతి
  • దాడి వెనుక ఎవరున్నారో
Nigeria Church Attack: నైజీరియాలో చర్చిపై ఉగ్ర దాడి.. 50 మంది మృతి!

At least 50 people killed in shooting at church in Nigeria: నైజీరియాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుళ్లలో భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్ర దాడిలో దాదాపుగా 50 మంది చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. వీరిలో స్త్రీలు, చిన్నారులు కూడా ఉన్నారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను ఓవోలోని ఫెడరల్ మెడికల్ సెంటర్ మరియు సెయింట్ లూయిస్ కాథలిక్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు.

ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రార్థనల కోసం ఒండో రాష్ట్రంలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ క్యాథలిక్‌ చర్చికి వచ్చారు. చర్చ్‌లో ప్రజలు ప్రార్థనలు చేసుకుంటుండగా.. లోపలికి చొరబడిన ఉగ్రవాది విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆపై చర్చి ప్రధాన పాస్టర్‌ను అపహరించారు. ఈ దాడిలో దాదాపుగా 50 మంది మరణించి ఉంటారని స్థానిక శాసన సభ్యుడు టిమిలెయిన్‌ పేర్కొన్నారు. అయితే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని కొందరు అధికారులు చెబుతున్నారు. 

రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో సెయింట్‌ ఫ్రాన్సిస్‌ క్యాథలిక్‌ చర్చ్ భయానకంగా మారింది. నైరుతిలో రాష్ట్రంలోని ఓవోలోని ఒక ఆసుపత్రిలోని ఒక వైద్యుడు రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. 50 కంటే తక్కువ మృతదేహాలను ఫెడరల్ మెడికల్ సెంటర్, సెయింట్ లూయిస్ కాథలిక్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. గాయపడిన వారికి చికిత్స అందించామని పేర్కొన్నారు. చర్చిపై దాడి వెనుక ఎవరున్నారో ఇంకా తెలియరాలేదు.

చర్చిలో జరిగిన కాల్పుల ఘటన అనంతరం తమ హృదయాలు బరువెక్కాయని ఒండో గవర్నర్ రోటిమి అకెరెడోలు ట్వీట్ చేశారు. ఈ ఉగ్ర దాడిని నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ ఖండించారు. పిశాచాలు మాత్రమే ఇలాంటి దారుణ చర్యకు పాల్పడతాయని వ్యాఖ్యానించారు. చర్చిలో ముష్కరులు భక్తులపై కాల్పులు జరిపారని, పేలుడు పదార్థాలను పేల్చారని చెప్పారు. 

Also Read: AP SSC Results 2022: నేడే పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఈ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి!  

Also Read: Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు.. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News