అమెరికాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు బూస్టర్ డోసుకు అర్హులే!
Booster shots: శీతాకాలంలో కరోనా కేసులు పెరగొచ్చనే కారణంతో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసు ఇచ్చేందుకు సిద్ధమైంది.
Booster shots will be available to all adults in US: కరోనాపై పోరులోగా భాగంగా అమెరిరకా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతుండగా.. బూస్టర్ డోసు (Corona booster dose in USA) కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఇకపై 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ తీసుకునేందుకు అర్హులేనని ప్రకటించింది అమెరికా. ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతులతో (US FDA on Corona Vaccine) ఈ నిర్ణయం తీసుకుంది.
అమెరికాలో ఇప్పటి వరకు 19.5 కోట్ల మంది రెండు డోసుల వ్యాక్సిన్ (Vaccination in USA) వేసుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 3 కోట్ల మంది బూస్టర్ డోసు కూడా వేసుకోవడం గమనార్హం.
చలికాలంలో కరోనా కేసులు భారీగా పెరగొచ్చనే అంచనాల నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also read: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా కమలా హారిస్ రికార్డు!
ఇంతకు ముందే బూస్టర్ డోసుకు అనుమతి.. కానీ..
నిజానికి అమెరికా ఇప్పటికే బూస్టర్ డోసులు ఇస్తోంది. అయితే 65 ఏళ్ల దాటిన వారికి, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మాత్రమే బూస్టర్ డోసుకు అర్హులుగా తేల్చింది. ఇప్పుడు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి బూస్టర్ డోసు వేసుకునే అవకాశం కలక్పించింది.
Also read: విజృంభిస్తున్న కరోనా కేసులు...ఆ దేశంలో మళ్లీ లాక్‌డౌన్...!
Also read: సంచలనం: మహిళతో సెక్స్ చాటింగ్.. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన పైన్!
బూస్టర్ డోసు ఎప్పుడు తీసుకోవాలంటే..
కరోనా నుంచి రక్షణకోసం ప్రతి ఒక్కరు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవడం తప్పనిసరి. అయితే రెండో డోసు తీసుకున్న కనీసం ఆరు నెలల తర్వాతే బూస్టర్ డోసు వెసుకునేందుకు అనుమతి ఉంది.
అయితే ముందు తీసుకున్న రెండు డోసులతో సంబంధం లేకుండా.. బూస్టర్ డోసుగా దేనినైనా తీసుకునే వీలుంది. అంటే మొదటి రెండు డోసులు ఫైజర్ తీసుకున్న వ్యాక్తి.. బూస్టర్ డోసుగా మెడార్నా టీకాను వేసుకోవచ్చు.
అమెరికాలో కరోనా కేసులు..
అమెరికాలో ఇప్పటి వరకు 4.85 కోట్ల మంది కరోనా బారిన (Corona cases in USA) పడ్డారు. అందులో దాదాపు 8 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
Also read: డ్రంక్ అండ్ డ్రైవ్ సమస్యకు సాంకేతిక పరిష్కారం.. ఇక ప్రమాదాలకు చెక్!
Also read: కోవిడ్ ట్యాబ్లెట్స్‌పై ఫైజర్ కీలక నిర్ణయం, ఇతర కంపెనీలకు అనుమతులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook