Ashraf Ghani got shelter in UAE: అశ్రఫ్ ఘని అఫ్గానిస్థాన్ నుంచి పారిపోయిన తర్వాత మూడు రోజులకు అతడు ఎక్కడున్నాడు అనే వివరాలు బయటి ప్రపంచానికి తెలిశాయి. అశ్రఫ్ ఘని తమ దేశంలోనే తలదాచుకున్నట్టు యూఏఈ స్వయంగా ప్రకటించింది. మానవత్వ హృదయంతో అతడికి ఆశ్రయం కల్పించినట్టు బుధవారం అఫ్గనిస్థాన్ విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. అయితే, యూఏఇలో అశ్రఫ్ ఘనీ ఎక్కడ ఉన్నాడనే విషయంలోనే అక్కడి ప్రభుత్వం స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అఫ్గానిస్థాన్ (Ashraf crisis) నుంచి అశ్రఫ్ ఘని పారిపోయాడని వార్తలొచ్చిన అనంతరం అతడు ముందుగా తజకిస్థాన్‌లో తల దాచుకున్నట్టు ప్రచారం జరిగింది. అల్ జజీరా వార్తా సంస్థ మాత్రం అశ్రఫ్ ఘని ఒమన్ పారిపోయాడని పేర్కొంది. ఒమన్ నుంచి అమెరికా వెళ్లేందుకు అశ్రఫ్ ఘని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇంకొన్ని మీడియా సంస్థల్లో కథనాలొచ్చాయి. 


Also read : Taliban meets Hamid Karzai: అఫ్గనిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయితో తాలిబన్ల అగ్రనేత భేటీ


అశ్రఫ్ ఘని అఫ్గనిస్థాన్ (Ashraf Ghani fled Afghanistan) నుంచి పారిపోతూ పారిపోతూ.. నాలుగు కార్లు, హెలీక్యాప్టర్ నిండా డబ్బు సంచులు కుక్కుకుని పోయినట్టు అఫ్గానిస్థాన్ లో ఉన్న రష్యా రాయబార కార్యాలయం ఆరోపించింది. 


అఫ్గనిస్థాన్‌లో రక్తపాతం ఉండకూడదని కోరుకుంటూ దేశం విడిచి వెళ్లిపోతున్నానని, తాలిబన్ల (Talibans) ఆయుధ బలం ముందు తల వంచక తప్పడం లేదని అశ్రఫ్ ఘని తన ఫేస్‌బుక్ పోస్టులో రాసుకొచ్చిన సంగతి తెలిసిందే.


Also read : Ashraf Ghani: అశ్రఫ్ ఘనీ 4 కార్లు, హెలీక్యాప్టర్ నిండా డబ్బుతో పారిపోయాడా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook