Ashraf Ghani: అశ్రఫ్ ఘనీ 4 కార్లు, హెలీక్యాప్టర్ నిండా డబ్బుతో పారిపోయాడా ?

Ashraf Ghani fled Afghanistan, Where is Ashraf Ghani : అశ్రఫ్ ఘనీ తొలుత తజకిస్తాన్‌కు (Tajikistan) పారిపోయినట్టు వార్తలొచ్చినప్పటికీ.. అక్కడ ఘని చాపర్ (Ashraf Ghani's helicopter) దిగేందుకు అనుమతి లభించకపోవడంతో అక్కడి నుంచి ఒమన్‌కి పారిపోయి తలదాచుకున్నట్టు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలొస్తున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 16, 2021, 08:58 PM IST
Ashraf Ghani: అశ్రఫ్ ఘనీ 4 కార్లు, హెలీక్యాప్టర్ నిండా డబ్బుతో పారిపోయాడా ?

Ashraf Ghani fled Afghanistan, Where is Ashraf Ghani ?: కాబూల్: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు అధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో ఆఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజధాని కాబూల్ నుంచి నాలుగు కార్లు, ప్రైవెట్ చాపర్ నిండా డబ్బులు నింపుకుని పారిపోయాడని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. చాపర్‌లో మరింత ధనాన్ని నింపేందుకు యత్నించినప్పటికీ, చాపర్‌లో ఇంకా డబ్బు కుక్కేందుకు సరిపడా స్థలం లేకపోవడంతో పెద్దమొత్తంలో డబ్బులను వదిలేసి వెళ్లాడనేది ఆ వార్తల సారాంశం. రష్యన్ న్యూస్ ఏజెన్సీ ఆర్ఐఏ (RIA) ఈ వివరాలు వెల్లడించినట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ పేర్కొంది. కాబూల్‌లో ఉన్న రష్యన్ రాయబార కార్యాలయం (Russian embassy in Afghanistan) అధికార ప్రతినిథి ఈ వివరాలు వెల్లడించారని రష్యన్ మీడియా చెబుతోంది.

అశ్రఫ్ ఘనీ తొలుత తజకిస్తాన్‌కు (Tajikistan) పారిపోయినట్టు వార్తలొచ్చినప్పటికీ.. అక్కడ ఘని చాపర్ (Ashraf Ghani's helicopter) దిగేందుకు అనుమతి లభించకపోవడంతో అక్కడి నుంచి ఒమన్‌కి పారిపోయి తలదాచుకున్నట్టు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలొస్తుండగా... అశ్రఫ్ ఘనీతో పాటు ఆయన భార్య, చీఫ్ ఆఫ్ స్టాఫ్, దేశ భద్రతా సలహాదారు ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌కు పారిపోయారని అంతర్జాతీయ వార్తా సంస్థ అల్ జజీరా పేర్కొంది. 

Also read : Afghanistan crisis: తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఆఫ్గనిస్థాన్‌లో క్రికెట్ పరిస్థితి ఏంటి ?

ఇదిలావుంటే, అశ్రఫ్ ఘనీ అమెరికా వైపు (Ashraf Ghani in America ?) వెళ్లినట్టుగానూ వార్తలొస్తున్నప్పటికీ.. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నాడనే సమాచారంపై ఎవరి వద్ద స్పష్టమైన సమాచారం లేదు. ఆఫ్ఘానిస్థాన్‌లో రక్తపాతం జరగకుండా ఉండేందుకే తాను దేశం విడిచిపెట్టి పోతున్నట్టు అశ్రఫ్ ఘనీ తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొనడం గమనార్హం. ఆదివారం కాబూల్ నుంచి పారిపోయిన అశ్రఫ్ ఘనీ (Afghanistan).. అంతకంటే ముందుగా తన ఫేస్‌బుక్ పోస్టు ద్వారా ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు.

Also read: Afghanistan: కుటిల బుద్ది చూపించిన చైనా.. తాలిబన్లతో దోస్తీకి సై అంటున్న డ్రాగన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News