తాలిబన్ స్థావరాలపై ఆఫ్ఘనిస్తాన్ దాడులు, 250 మంది ఉగ్రవాదులు మృతి
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి ఉగ్రవాదులపై భారీగా దాడులు చేసింది. కందహార్ ప్రావిన్స్‌లో జరిగిన దాడుల్లో పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడులకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి ఉగ్రవాదులపై భారీగా దాడులు చేసింది. కందహార్ ప్రావిన్స్‌లో జరిగిన దాడుల్లో పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడులకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వ రక్షణ దళాలు(Afghan Forces)..తాలిబన్ స్థావరాలపై భారీగా వైమానిక దాడులు చేశారు. ఈ దాడుల్లో పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు. గత 24 గంటల్లో పలు ప్రధాన నగరాల్లో జరిగిన దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు మరణించగా..వందమందివరకూ గాయపడినట్టు తెలుస్తోంది. తాలిబన్లు ఆక్రమించుకున్న గ్రామీణ భూభాగంలో ప్రాంతాల్ని ఆఫ్ఘనిస్తాన్ రక్షణ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. కీలకమైన సరిహద్దు క్రాసింగ్‌లను స్వాధీనం చేసుకున్న తరువాత..తాలిబన్లు(Talibans) ఉండే ప్రొవిన్షియల్ రాజధానుల్ని ముట్టడించారు. శనివారం రాత్రి కందహార్ విమానాశ్రయం(Kandahar Airport)పై మూడు రాకెట్లను ప్రయోగించాయి. విమానాశ్రయంపై దాడి, లాజిస్టిక్, ఎయిర్‌హెల్ప్ కోసం ముఖ్యమైన కీలకమైన ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలన్నది ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వ ఆలోచన. హెల్మాడ్ ప్రావిన్స్‌లోని లష్కర్‌గాహ్ సమీపంలోని రెండు వేర్వేరు ప్రొవిన్షియల్ రాజధానుల్ని స్వాధీనం చేసుకునేందుకు ఆఫ్ఘన్ దళాలు ప్రయత్నిస్తున్నాయి.
Also read: ఇండియాలో 49 కోట్ల మైలురాయి దాటిన వ్యాక్సినేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook