India Vaccination Update: దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంపై దృష్టి సారించారు.
కరోనా మహమ్మారి(Corona pandemic)గత వారం రోజుల్నించి క్రమక్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రలలో పెద్దఎత్తున కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ ఉధృతి నెమ్మదిగా పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంపై దృష్టి సారించారు. దేశంలో వ్యాక్సినేషన్ ఇప్పటి వరకూ 49 కోట్ల మైలురాయి దాటింది. ఒక్క జూలై నెలలోనే 13 కోట్లమందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం 3 కోట్లకు పైగా వ్యాక్సిన్(Vaccine)నిల్వ ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ(Union health ministry) వెల్లడించింది. దేశంలో కరోనా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 3 కోట్లకు పైగా జనం కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 95 శాతం మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
దేశంలో ప్రస్తుతం రోజుకు 41 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2.2 కోట్లమందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉండగా..1.12 కోట్లమందికి సింగిల్ డోస్ పూర్తయింది. మరో 33.79 లక్షలమందికి రెండు డోసులు పూర్తయ్యాయి. దేశంలో అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ (Covaxin)వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్ధ్యం కూడా రోజురోజుకూ పెరుగుతోంది.
Also read: కేరళ నుంచి వస్తే ఆర్టీపీసీఆర్ తప్పనిసరి, కర్ణాటక బాటలో తమిళనాడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook