Kabul Blast: ఆఫ్గనిస్తాన్‌లో భారీ పేలుడు.. రక్తసిక్తమైన మసీదు.. 20 మంది మృతి
Kabul Blast 20 Died: ఆఫ్గనిస్తాన్‌లో ఓ మసీదు బాంబు దాడితో రక్తసిక్తమైంది. దాదాపు 20 మంది మృతి చెందగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Kabul Blast 20 Died: ఆఫ్గనిస్తాన్ మరోసారి బాంబు దాడితో దద్దరిల్లింది. కాబూల్ పరిసర ప్రాంతమైన ఖైర్ ఖానాలోని సిద్ధిఖియా మసీదులో భారీ పేలుడు చోటు చేసుకుంది. సాయంత్రం సమయంలో మత ప్రార్థనలు జరుగుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 20 మంది మృతి చెందగా 40 మంది వరకు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
పేలుడులో గాయపడినవారిని కాబూల్‌లో ఓ ఇటలీ ఎన్జీవో నిర్వహిస్తున్న ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 27 మందికి చికిత్స అందిస్తున్నట్లు అక్కడి సిబ్బంది వెల్లడించారు. తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహీద్ బాంబు దాడిని ధ్రువీకరించారు. అయితే దాడిలో ఎంతమంది చనిపోయారనేది చెప్పలేదు. దాడికి బాధ్యులైనవారిని త్వరలోనే కఠినంగా శిక్షిస్తామన్నారు.
మసీదులో పేలుడు ధాటికి సమీపంలోని భవనాల కిటికీలు కూడా ధ్వంసమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. బాంబు దాడిలో మసీదు ఇమామ్ ముల్లా అమీర్ మహమ్మద్ కాబూలీ కూడా మృతి చెందినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇంటలిజెన్స్ టీమ్స్ బాంబు దాడికి సంబంధించిన క్లూస్‌ను సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి.
ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంలో ఈ పేలుడు చోటు చేసుకోవడం గమనార్హం. ఆఫ్గనిస్తాన్‌కు తాము పటిష్ఠ భద్రత అందిస్తున్నామని చెబుతున్న తాలిబన్లకు ఇది శరాఘాతమే. ఇటీవలి కాలంలో ఆఫ్గనిస్తాన్‌లో ఐఎస్ఐఎస్-కె దాడులు పెరిగిపోయాయి. గత వారం కాబూల్‌లో తాలిబన్ నేత షేక్ రహీముల్లా హక్కనీ ఆత్మాహుతి దాడిలో మృతి చెందాడు. ఈ దాడి తమ పనే అని ఐసిస్ ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లో ఓ సిక్కు దేవాయలంపై దాడి జరగ్గా.. అది కూడా తామే చేశామని ఐసిస్ ప్రకటించుకుంది. ఐసిస్‌ను నిలువరించలేకపోతే ఆఫ్గనిస్తాన్‌లో మరిన్ని దాడులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు.
Also Read : Munugode Bypolls Updates: మునుగోడులో బీజేపి సభ సక్సెస్‌కు బండి సంజయ్ స్కెచ్ ఇదేనట
Also Read: Horoscope Today August 18th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు అనుకోని వివాదంలో చిక్కుకునే ప్రమాదం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook