Kabul bomb blast: అఫ్గానిస్థాన్‌ను (Afghanistan) వరుస పేలుళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా మరోసారి బాంబు పేలుడు సంభవించింది. దేశ రాజధాని కాబూల్‌లోని ఓ మసీదులో శక్తివంతమైన బాంబు బ్లాస్ట్ (Kabul bomb blast) జరిగింది. ఈ ఘటనలో 50 మందికిపైగా పౌరులు మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వార్తలు వెలువరించాయి. ఇది ఆత్మాహుతి దాడిగా తెలుస్తోంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రంజాన్ సందర్భంగా శుక్రవారం కాబుల్‌లోని స్థానిక ఖలీఫా సాహిబ్‌ మసీదులో (Khalifa Sahib mosque) భక్తులు ప్రార్థనలు చేసుకున్నారు. మధ్యాహ్నం ప్రార్థనలు ముగించుకుని వెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ పేలుడు ఘటనలో మెుదట 10 మంది గాయపడినట్లు తాలిబన్ (Taliban) అధికారులు ప్రకటించారు. అయితే సాయంత్రానికల్లా మృతుల సంఖ్య 50కి పెరిగినట్లు మసీదు నేతలు తెలిపారు. మరో 100కి పైగా గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 


ఈ ఘటన వెనుక ఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ హస్తం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి అఫ్గాన్‌లో వరుస పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. గత 10 రోజుల్లో దాదాపు 11 దాడులు జరిగాయి. 


Also Read: Russia Ukraine War: రష్యా దాడులకు శవాల దిబ్బగా ఉక్రెయిన్... కీవ్ ఒబ్లాస్ట్‌లో 900 మృతదేహాలు.. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook