Russia Ukraine War: రష్యా దాడులకు శవాల దిబ్బగా ఉక్రెయిన్... కీవ్ ఒబ్లాస్ట్‌లో 900 మృతదేహాలు..

Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. పుతిన్ దూకుడు చూస్తుంటే ఉక్రెయిన్‌ను పూర్తిగా ఆక్రమించుకునేదాకా ఆయన శాంతించేలా లేరు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 11:13 AM IST
  • రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అప్‌డేట్స్
  • కీవ్ ఒబ్లాస్ట్‌లో 900 మృతదేహాలు గుర్తించినట్లు వెల్లడించిన జెలెన్‌స్కీ
  • శవాల దిబ్బగా మారుతోన్న ఉక్రెయిన్
Russia Ukraine War: రష్యా దాడులకు శవాల దిబ్బగా ఉక్రెయిన్... కీవ్ ఒబ్లాస్ట్‌లో 900 మృతదేహాలు..

Russia Ukraine War : ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ రక్తపుటేరులు పారిస్తోంది. అమాయక పౌరుల ప్రాణాలను బలిగొంటోంది. ఉక్రెయిన్‌లో రష్యా జవాన్ల ఆకృత్యాలు మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. రష్యా పిడికిట నలిగి విలవిల్లాడుతున్న ఉక్రెయిన్ శవాల దిబ్బగా మారుతోంది. ఇటీవలి రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌లోని కీవ్ ఒబ్లాస్ట్‌లో దాదాపు 900 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు.

రష్యా దాడుల్లో కీవ్ ఒబ్లాస్ట్ ప్రావిన్స్‌లో ఇప్పటివరకూ 900 మంది మృతి చెందినట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేసిన ఉక్రెయిన్ మీడియా కీవ్ ఇండిపెండెంట్... 900 మంది మృతదేహాలను ఒకేచోట గుర్తించినట్లు పేర్కొంది. ఆ తర్వాత ఇదే వార్తకు చిన్న సవరణ చేసింది. కీవ్ ఒబ్లాస్ట్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పటివరకూ 900 మృతదేహాలను గుర్తించినట్లు జెలెన్‌స్కీ వెల్లడించారని పేర్కొంది. కీవ్ ఒబ్లాస్‌పై రష్యా మిస్సైల్ దాడులకు పాల్పడిందని... మూడుసార్లు మిస్సైల్స్ ప్రయోగించిందని తెలిపింది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి ఇప్పటికే 5.4 మిలియన్ల ప్రజలు శరణార్థులుగా ఇతర దేశాలకు పారిపోయారని వెల్లడించింది. అంతర్గతంగా మరో 7.7 మిలియన్ల ప్రజలు చెల్లా చెదురైపోయారని పేర్కొంది. ఇప్పటికే పలు ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న రష్యా... డాన్బాస్ రీజియన్‌ను ఆక్రమించుకునేందుకు వడివడిగా ముందుకు కదులుతోంది. ఇక్కడ వేర్పాటువాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో డాన్బాస్‌ను సులువుగా చేజిక్కించుకోవచ్చునని రష్యా భావిస్తోంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఇప్పటికే రెండు నెలలు దాటిపోయింది. పలుమార్లు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినప్పటికీ అవేవీ సఫలం కాలేదు. ఫలితంగా రష్యా దాడులకు పాల్పడుతూనే ఉంది. ఉక్రెయిన్ మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునేదాకా రష్యా విశ్రమించేలా కనిపించట్లేదు. మరోవైపు, ఉక్రెయిన్ సైతం తమ శాయాశక్తుల పోరాడుతూనే ఉంది. రష్యా ముందు మోకరిల్లేందుకు ఉక్రెయిన్ సిద్దంగా లేదు. దేశాన్ని రష్యా దురాక్రమణ నుంచి కాపాడుకునేందుకు తుది శ్వాస వరకు పోరాడుతానని జెలెన్‌స్కీ ఇదివరకే పలుమార్లు వెల్లడించారు. 

Also Read: Viral Video: బైకర్‌ను బలితీసుకున్న బండరాయి... మృత్యువు రూపంలో ఎలా దూసుకొచ్చిందో చూడండి

Also Read: SVP Story: 'సర్కారు వారి పాట'... కథలో అసలు పాయింట్స్ రివీల్ చేసిన ఎడిటర్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News