Afghan New Government: ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు మరింత ఆలస్యం, ఆధిపత్య పోరే కారణం
Afghan New Government: ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. అధికారం కోసం రెండు గ్రూపుల మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలే దీనికి కారణంగా తెలుస్తోంది. ఆఫ్ఘన్‌లో ఇప్పుడు బరాదర్ వర్సెస్ హక్కానీ పోరు నడుస్తోంది.
Afghan New Government: ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. అధికారం కోసం రెండు గ్రూపుల మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలే దీనికి కారణంగా తెలుస్తోంది. ఆఫ్ఘన్‌లో ఇప్పుడు బరాదర్ వర్సెస్ హక్కానీ పోరు నడుస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో(Afghanistan) అధికారం ఎవరు చేపట్టనున్నారనే విషయంలో ఇంకా గందరగోళం నెలకొంది. తాలిబన్ ఛీఫ్ ముల్లా బరాదర్‌తో ప్రభుత్వాన్ని పంచుకోడానికి అతివాద గ్రూప్‌గా ముద్రపడిన హక్కానీ నెట్‌వర్క్ సిద్ధంగా లేదని తెలుస్తోంది. పాకిస్తాన్ మద్దతు కలిగిన హక్కానీ గ్రూప్..తాలిబన్ రాజకీయ విభాగం ఛీఫ్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నిర్ణయాలతో వ్యతిరేకిస్తోంది. అంతర్జాతీయ సమాజం ఆమోదం పొందలా మైనార్టీలు సైతం ప్రభుత్వంలో భాగం కావాలనేది బరాదర్ ఆలోచన. అయితే హక్కానీ గ్రూప్ ఈ అభిప్రాయంతో విభేధిస్తోంది. పూర్తిగా తాలిబన్ ప్రభుత్వమే ఉండాలని చెబుతోంది. కాబూల్‌ను(Kabul) గెల్చుకున్నామని..ఆప్ఘన్ రాజధానిపై ఆధిపత్యం కలిగి ఉన్నందున..వెనక్కు తగ్గాలని బరాదర్‌ను కోరుతోంది హక్కానీ గ్రూప్(Hakkani Group).
వాస్తవానికి శనివారమే ఆప్ఘనిస్తాన్‌లో బరాదర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. కానీ చర్చలు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. అంతర్జాతీయ సమాజం ఆమోదం పొందేలా ప్రభుత్వాన్ని తీర్చిదిద్దే పనిలో ఉన్న తాలిబన్లు (Talibans)కొత్త ప్రభుత్వ ఏర్పాటును వచ్చే వారానికి వాయిదా వేశారు. ప్రపంచ దేశాల మద్దతు లభించేలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు(Afghan new government) ప్రక్రియ ఆలస్యమవుతోందని తాలిబన్ చర్చల కమిటీ సభ్యుడు ఖలీల్ హక్కానీ తెలిపారు. వర్గపోరును, ఆధిపత్య పోరును తగ్గించుకుని ఆప్ఘన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటనేది సవాలుగానే మారనుంది. అతివాద,మితవాద ఆలోచనల్లో ఏర్పడుతున్న బేధాభిప్రాయాలే కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యానికి కారణమవుతున్నాయని తెలుస్తోంది.
Also read: Modi America Tour: సెప్టెంబర్‌లోనే ప్రదాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook