Panjshir Army: తాలిబన్లకు ఆ లోయలో ఎదురు దెబ్బ, 3 వందలమంది తాలిబన్లు హతం
Panjshir Army: ఆఫ్ఘనిస్తాన్ దేశంపై ఆధిపత్యం చెలాయించిన తాలిబన్లకు ఆ ఒక్కచోట మాత్రం ప్రతిఘటన ఎదురవుతోంది. తాలిబన్లకు ఎదురుదెబ్బ భారీగా తగిలింది. పెద్దఎత్తున ప్రాణనష్టం కూడా సంభవించిందని తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..
Panjshir Army: ఆఫ్ఘనిస్తాన్ దేశంపై ఆధిపత్యం చెలాయించిన తాలిబన్లకు ఆ ఒక్కచోట మాత్రం ప్రతిఘటన ఎదురవుతోంది. తాలిబన్లకు ఎదురుదెబ్బ భారీగా తగిలింది. పెద్దఎత్తున ప్రాణనష్టం కూడా సంభవించిందని తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..
ఆఫ్ఘన్ నేలపై ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించడంతో దేశాన్ని విడిచి వెళ్లిపోయేందుకు జనం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కాబూల్ విమానాశ్రయం(Kabul Airport) వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమిగూడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. 7 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశం మొత్తంపై ఆధిపత్యం చెలాయించినా.. ఆ ఒక్క ప్రాంతం మాత్రం తాలిబన్లను ఇబ్బంది పెడుతోంది.
పంజ్‌షీర్ ప్రావిన్స్(Panjshir province) మాత్రం తాలిబన్ల చేతికి చిక్కలేదు. పంజ్‌షీర్ లోయను(Panjshir valley) ఆక్రమించేందుకు వెళ్లిన తాలిబన్లకు ప్రతిఘటన ఎదురైంది. అంతేకాదు పంజ్‌షీర్ సైన్యం చేతిలో తాలిబన్లు చావుదెబ్బ తిన్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇప్పటి వరకూ 3 వందలమంది తాలిబన్లను హతమయ్యారని సమాచారం. ఈ క్రమంలోనే బాగ్లాన్, అంద్రాబ్ ప్రాంతాల్ని తిరిగి కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. పంజ్‌షీర్ సైన్యం చేతిలో చావుదెబ్బ ఎదురుకావడంతో పెద్దఎత్తున సైన్యం, ఆయుధాలతో మరోసారి దాడికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పంజ్‌షీర్ లోయ మాత్రం తాలిబన్లను కలవరపెడుతూ సవాలు విసురుతోంది. తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని పంజ్‌షీర్ ప్రజలు ప్రకటించారు. పంజ్‌షీర్ లోయలోకి వెళ్లే మార్గాల్లో ఎక్కడికక్కడ గట్టి పహారా ఏర్పాటైంది. తాలిబన్లను ఎదుర్కొని వారిని ఇబ్బంది పెడుతున్న పంజ్‌షీర్ సైన్యం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తాలిబన్ల (Talibans)చెర నుంచి ఆఫ్ఘన్‌ను విముక్తి చేసేది అహ్మద్ షా మసూద్ నేతృత్వంలోని పంజ్‌షీర్ సైన్యమేననేది(Panjshir army) అక్కడి ప్రజల విశ్వాసం.
Also read: Elon Musk: మాస్క్ ధరించకపోవడంపై తాలిబన్లపై కోపం ప్రదర్శించిన ఎలన్ మస్క్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook