17 ఏళ్ల భారతీయుల నిరీక్షణ సాకారమైంది. శనివారం చైనా లోని సాన్యా నగరంలో  జరిగిన 'మిస్ వరల్డ్-2017' ఫైనల్స్ కాంపిటీషన్ లో భారత్ కు చెందిన మానుషి చిల్లర్(20) ప్రపంచ సుందరిగా ఎంపికైంది. హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ వైద్య విద్యార్థిని. ఆమె తల్లితండ్రులిద్దరూ కూడా డాక్టర్లే. కాగా, ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న ఆరో భారతీయురాలిగా మానుషి నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిస్ వరల్డ్-2017 లో 108 మంది పోటీపడ్డారు. తుది రౌండ్ లో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, కెన్యా, మెక్సికో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. భారత్ కు ప్రపంచ సుందరి కిరీటం వరించింది. ఈ పోటీలో మొదటి రన్నరప్ గా ఇంగ్లాండ్ కు చెందిన స్టెఫానీ హిల్, రెండో రన్నరప్ గా మెక్సోకో కు చెందిన ఆండ్రియా మెజాలు నిలిచారు. గతఏడాది మిస్ వరల్డ్ స్టెఫానీ డెల్ విల్లే (ప్యూర్టోరికో) తన స్వహస్తాలతో మిస్ వరల్డ్ కిరీటాన్ని అందించింది. 


గతంలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో భారతీయుల హవా 


రిటీ ఫెరీరా-1966, ఐశ్వర్యారాయ్-1994, డయానా హేడెన్-1997, యుక్తాముఖీ-1999, ప్రియాంకా చోప్రా- 2000