US President Donald Trump moved to military hospital for treatment: న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ (Melania Trump) కరోనాబారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడే స్వయంగా తెలిపారు. తమకు నిర్వహించిన కరోనా (Coronavirus) పరీక్షలో పాజిటివ్‌ (Donald Trump Tests positive for COVID19) గా నిర్థారణ అయిందని గురువారం అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే వైట్‌హౌస్‌లోనే క్వారంటైన్ ఉండనున్నట్లు ముందుగా తెలిపినప్పటికీ.. ఆ తర్వాత చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు ట్రంప్ వెల్లడించారు. చికిత్స కోసం వాల్టర్ రీడ్ మిలటరీ ఆసుపత్రిలో (Walter Reed National Military Medical Center) కు వెళుతున్నట్లు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ కూడా ఆరోగ్యంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తమ ఆరోగ్యం కోసం మద్ధతు ప్రకటించిన ప్రతిఒక్కరికి తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ ట్రంప్ పేర్కొన్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలాఉంటే.. ట్రంప్‌కు కరోనా సోకడంతో ఆయన ఎన్నికల ప్రచారానినికి బ్రేక్ పడినట్లయింది. అమెరికాలో నవంబరు 3న ఎన్నికలు జరగనున్నాయి. అయితే అంతకు ముందే ట్రంప్‌కు నెగిటివ్ వస్తుందని వైట్‌హౌస్ సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే అధ్యక్షుడు ఆసుపత్రి నుంచే పనిచేస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. 74ఏళ్ల ప్రెసిడెంట్‌ ట్రంప్‌కు తేలికపాటి జ్వరం ఉందని.. అయినా ఉత్సాహంగా ఉన్నారని నిరంతరం ఆయన్ను పర్యవేక్షిస్తున్న వైద్యులు పేర్కొన్నట్లు  వైట్ హౌస్ వైద్యుడు సీన్ కొన్లీ అధికారిక ప్రకటనలో తెలిపారు. Also read: Donald Trump Tests positive for COVID19: డొనాల్డ్ ట్రంప్, మెలానియాలకు కరోనా పాజిటివ్


ఇదిలాఉంటే.. ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గర సలహాదారిణిగా సేవలందిస్తున్న హోప్ హిక్సు కరోనా వైరస్ బారిన పడింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులు కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. అయితే కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలానియా దంతులు త్వరగా కోలుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi ) శుక్రవారం ట్విట్ చేసి ఆకాంక్షించిన విషయం తెలిసిందే.  Also read: Narendra Modi: ట్రంప్ దంపతులు త్వరగా కోలుకోవాలి