ముంబై నుంచి నెవార్క్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని లండన్‌లోనే దించేసినట్టు ఎయిర్ ఇండియా ట్విటర్ ద్వారా వెల్లడించింది. AI 191 ముంబై-నెవార్క్ విమానాన్ని లండన్‌లోని స్టాన్‌స్టెడ్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేసినట్టు ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.