Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలు మారిపోయాయి. ఇప్పుడక్కడ తాలిబన్ ప్రభుత్వం ఏర్పడింది. ఫలితంగా కాబూల్‌లోని భారత దౌత్య సిబ్బందిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియ ముగిసింది. ప్రత్యేక సి 17 విమానం అక్కడున్న భారతీయుల్ని తీసుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం(Taliban government)ఏర్పడటంతో మారిన పరిణామాలు ఆందోళన రేపుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆ దేశంలో ఉన్న భారత దౌత్య సిబ్బందిని వెనక్కి క్షేమంగా తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. వైమానిక దళానికి చెందిన ప్రత్యేక సి 17 విమానంలో 150 మంది దౌత్యవేత్తలు, అధికారులు, భద్రతా సిబ్బందిని తీసుకొచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలోని హిండెన్ విమానాశ్రయంలో ఈ ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. సిబ్బంది తరలింపు పూర్తవడంతో అక్కడున్న భారతీయ పౌరుల్ని తీసుకురావడంపై దృష్టి సారించింది భారత విదేశాంగ శాఖ. 


ఆఫ్ఘనిస్తాన్‌లో (Afghanistan)క్లిష్ట పరిస్థితులున్నాయని..అక్కడున్న భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా తప్పనిసరిగా విమానాలు నడపాలన్నారు. భారత దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకురావడంలో చాలా సవాళ్లు ఎదురయ్యాయి.ఇండో టిబెట్ సరిహద్దు భద్రతా సిబ్బంది పహాహా మధ్య దౌత్యసిబ్బంది విమానాశ్రయానికి చేరుకున్నారు.తొలివిడతలో ప్రయాణించాల్సిన భారతీయులు విమానాశ్రయానికి వచ్చే క్రమంలో తాలిబన్లు అడ్డుకుని..వారి దగ్గరున్న వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు.ఆప్ఘనిస్తాన్‌లో ఉన్న భారతీయుల్ని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Pm Narendra modi) అధికారులను ఆదేించారు. ఇండియాకు రావాలని కోరుకుంటున్న ఆఫ్ఘన్‌లోని హిందూవులు, సిక్కులకు దేశంలో ఆశ్రయం కల్పించాలన్నారు. 


Also read: Afghan Emergency Visa: ఆఫ్ఘన్‌లో ఇండియన్స్ కోసం ఎమర్జన్సీ వీసా జారీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి