ఇజ్రాయెల్‌లో ఉన్న అమెరికా రాయబారి కార్యాలయాన్ని జెరూసలేంకు మార్చాలని ఇటీవలే అమెరికా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే నిర్ణయంపై అల్‌ఖైదా నాయకుడు ఐమన్ అల్ జవహరి విరుచుకుపడ్డారు. అమెరికాకి తగిన గుణపాఠం నేర్పాలని ఆయన ముస్లిములకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ ఇజ్రాయెల్‌ రాజధాని కూడా ముస్లింల భూభాగమేనని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాడెన్ చనిపోయాక.. ఈజిప్టు వాసి తమ సంస్థ పురోగమనానికి బాధ్యత వహించారని ఆయన అన్నారు. పాలస్తీనాలోని ముస్లిములు  ఇప్పటికైనా మేల్కొని ఆయుధాలు చేపట్టాలని జవహరి అన్నారు. అమెరికాని తామెప్పుడూ శత్రువుగానే చూస్తామని.. అయితే ముస్లిములను ఒకేతాటి పైకి తీసుకురావడంలో ముస్లిం దేశాలు కూడా విఫలమయ్యాయని ఆయన అన్నారు.


ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన నిజ స్వరూపం చూపించారని.. శాంతియుతంగా ఈ సమస్యలు పరిష్కారం కావని.. జిహాద్ వల్లే ఈ సమస్యలను పరిష్కరించాలని జవహరి తెలిపారు.