Amazon layoffs: 10 వేల మంది సిబ్బందికి షాకివ్వనున్న అమేజాన్
Amazon Plans to lay off 10,000 employees: అమేజాన్ డివైజెస్ ఆర్గనైజేషన్, వాయిస్ అసిస్టెంట్ అలెక్సా, రిటేల్ విభాగం, మానవ వనరుల విభాగంలోంచి ఈ జాబ్ కట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ జాబ్ కట్స్‌పై సంచలన నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే అమేజాన్ కూడా అదే బాటలో నడుస్తుండటం కార్పొరేట్ ప్రపంచాన్ని, ఐటి ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది.
Amazon Plans to lay off 10,000 employees: ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా, ట్విటర్ కంపెనీల బాటలోనే ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన అమేజాన్ కూడా నడవబోతోందా అంటే అవుననే తెలుస్తోంది. రాబోయే రోజుల్లో అమెజాన్ కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించుకోవడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు అమేజాన్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ వారం రోజుల్లోనే ఆ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని మీడియాలో ప్రపంచ దిగ్గజమైన 'ది న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది. ఈ సంఖ్య అమేజాన్ కార్పొరేట్ ఉద్యోగుల్లో 3 శాతం కానుండగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో 1 శాతం కంటే తక్కువగానే ఉండనుందని ది న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.
అమేజాన్ డివైజెస్ ఆర్గనైజేషన్, వాయిస్ అసిస్టెంట్ అలెక్సా, రిటేల్ విభాగం, మానవ వనరుల విభాగంలోంచి ఈ జాబ్ కట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ జాబ్ కట్స్‌పై సంచలన నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే అమేజాన్ కూడా అదే బాటలో నడుస్తుండటం కార్పొరేట్ ప్రపంచాన్ని, ఐటి ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. తనకు ఉన్న 124 అమెరికన్ బిలియన్ డాలర్ల సంపదలోంచి మెజారిటీ భాగాన్ని చారిటీ కోసమే కేటాయిస్తానని అమేజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సీఎన్ఎన్ సంస్థకి వెల్లడించిన రోజే ఈ జాబ్స్ కట్ న్యూస్ కూడా రావడం గమనార్హం.
వాస్తవానికి అమేజాన్ సంస్థలో గత ఆరు నెలల నుంచే ఇబ్బందికరమైన పరిస్థితులు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. గంటల వారీగా పనిచేసే సిబ్బందిని దాదాపు 80 వేల మందిని అమెజాన్ ఇప్పటికే పక్కకు పెట్టేసింది. సెప్టెంబర్ నెలలోనే చిన్న చిన్న టీమ్స్‌లో రిక్రూట్మెంట్ ఆపేసింది. అక్టోబర్ నుంచే రీటేల్ బిజినెస్‌లో ఖాళీగా ఉన్న 10 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయలేదు. రెండు వారాల క్రితమే క్లౌడ్ కంప్యూటింగ్ సహా కార్పొరేట్ బిజినెస్‌లోనూ నియామకాల ప్రక్రియ నిలిపేసింది.
సిబ్బంది అధికంగా ఉన్న విభాగాలపైనే ఆర్థికమాంద్యం భారం పడుతోందని, ఆ కారణంగానే అమేజాన్ సైతం జాబ్ కట్స్ వైపు అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన రోజుల్లో అత్యంత అధిక లాభాలు చూసిన అమెజాన్ కంపెనీ ఆ తర్వాత గత 2 దశాబ్ధాల్లోనే అత్యంత దిగువ స్థాయిని కూడా చవిచూసింది.
కొవిడ్-19 సమయంలో ప్రపంచవ్యాప్తంగా అమేజాన్ రీటేల్ బిజినెస్‌కి జనం నుంచి విశేష ఆధరణ రావడంతో వారి అవసరాలకు అనుగుణంగా గత రెండేళ్ల కాలంలో కొంగొత్త ప్రయోగాల కోసం భారీగా సిబ్బందిని నియమించుకున్న అమేజాన్ సంస్థకి ఇప్పుడదే సిబ్బంది, కార్యనిర్వహణ తలకు మించిన భారంగా పరిణమించింది. దీంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమేజాన్ చేపట్టిన విస్తరణ ప్రణాళికలను సైతం ఉపసంహరించుకుంది. కొవిడ్-19 తర్వాత ఆన్‌లైన్ షాపింగ్‌లో జనం నుంచి స్పందన తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా కొత్త కొత్త ఇనిషియేటివ్స్‌ని సైతం మూసేసే పరిస్థితి దాపురించిందంటే ఆర్థిక మాంద్యం అమేజాన్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
Also Read : Meta Fired 11000 employees: మెటాలో 11 వేల మంది ఉద్యోగుల తొలగింపుపై మార్క్ జుకర్‌బర్గ్ స్పందన
Also Read : Twitter India: ఉద్యోగులకు కోలుకోలేని షాక్.. భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు..
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook