Amazon UK Customer gets Dog Food instead of MacBook Pro: ఈ కామర్స్ సంస్థలు వచ్చినప్పటినుంచి చాలా మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారు. ఏ వస్తువు కొనాలన్నా షాప్‌కు వెళ్లకుండా.. ఈ కామర్స్ సైట్‌లు వెతుకున్నారు. అయితే కొన్నిసార్లు ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా వేరే ప్రోడక్ట్ వస్తుంటాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. డెలివరీ తీసుకున్న కస్టమర్‌లు తాము ఆర్డర్ చేసిన వస్తువు లేకపోవడంతో ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రూ. 1.5 లక్షల మ్యాక్‌బుక్ ప్రోని ఆర్డర్ చేస్తే పెడిగ్రీ ప్యాకెట్లు వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లండ్‌లోని డెర్బీషైర్‌కు చెందిన 61 ఏళ్ల అలాన్ వుడ్ రిటైర్‌ ఐటీ మేనేజర్‌. వుడ్ తన కుమార్తె కోసం మ్యాక్‌బుక్ ప్రోను ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో నవంబర్ 29న ఆర్డర్ చేశారు. మ్యాక్‌బుక్ కోసం 1200 పౌండ్లు (రూ.1,20,329) చెల్లించారు. మరుసటి రోజే అమెజాన్ సిబ్బంది డెలివరీ ఇచ్చారు. సంతోషంలో అలాన్ వుడ్ తన కూతురిని పిలిచి గిఫ్ట్ ఇచ్చారు. దాంతో ఆమె సంతోషంలో మునిగిపోయింది. అయితే బాక్స్ ఓపెన్‌ చూసిన ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.


బాక్స్ ఓపెన్ చేసి చూడగా.. అందులో డాగ్ ఫుడ్ ప్యాకెట్స్‌ ఉన్నాయి. పెడిగ్రీని వెంటనే రిటర్న్ చేసిన అలాన్‌ వుడ్‌.. అమెజాన్‌ కంపెనీ ప్రతినిధులను సంప్రదించారు. మొదట రిటర్న్ ఇవ్వడానికి వారు నిరాకరించారు. దాదాపు 15 గంటలకు పైగా అమెజాన్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్లతో ఫోన్లో మాటాడిన వుడ్ చివరకు సక్సెస్ అయ్యారు. పేమెంట్ చేసిన డబ్బును తిరిగి ఇస్తామని అమెజాన్ హామీ ఇచ్చింది. కస్టమర్‌తో నేరుగా మాట్లాడి క్షమాపణలు చెప్పమని, ఇప్పుడు సమస్య పరిష్కారం అయిందని అమెజాన్‌ ఓ ప్రకటనలో ప్రకటించింది. పూర్తి రీఫండ్ ప్రాసెస్‌లో ఉందని పేర్కొంది.


Also Read: WhatsApp India: భారతీయులకు భారీ షాక్ ఇచ్చిన వాట్సాప్.. 37 లక్షల ఖాతాలు బ్యాన్! మీది ఉందో చెక్ చేసుకోండి  


Also Read: Apple iPhone: రూ.20 వేల లోపే ఐఫోన్.. ఎగబడి కొంటున్న జనం! ఇంత చౌకగా ఇదే తొలిసారి  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.