ఇండియా బిజినెస్ రూల్స్‌పై అమెరికా ఆగ్రహం!
ఇండియా బిజినెస్ రూల్స్‌పై అమెరికా ఆగ్రహం!
హార్లే డేవిడ్సన్ లాంటి ద్విచక్రవాహనాల దిగుమతులపై భారత్ అధిక సుంకం వసూలు చేస్తోంది అంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా తాజాగా మరోసారి అమెరికా భారత్ పై విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. భారత్‌సహా మరో నాలుగు పెద్ద దేశాలు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను అమలు చేయకుండా దిగుమతులపై అధిక సుంకం విధిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక నివేదిక అభిప్రాయపడినట్టు సమాచారం.
అమెరికా ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తుల కారణంగా వ్యాధులు సోకే ప్రమాదం వుందనే సాకు చూపించి అమెరికా ఉత్పత్తులపై భారత్ నిషేధం విధించడం సరికాదని ట్రంప్ సర్కార్ పేర్కొంది. ఏ శాస్త్రీయ ఆధారాలు లేకుండానే అమెరికా ఎగుమతి చేసే ఉత్పత్తులపై సందేహాలు వ్యక్తం చేయడం వాణిజ్య ఒప్పందాలకు విరుద్ధం అవుతుందని ట్రంప్ సర్కార్ స్పష్టంచేసినట్టు సమాచారం అందుతోంది.