Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యం నిష్క్రమణ ఘట్టం పూర్తయింది. ఇక నుంచి ఆ దేశంతో దౌత్య సంబంధాల విషయంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. అమెరికా చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయంగా తాలిబన్లపై ప్రభావం చూపించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)దేశాన్ని తాలిబన్లు ఆక్రమించిన తరువాత కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆగస్టు 31 డెడ్‌లైన్‌లోగా అమెరికా తన సైన్యాన్ని ఆ దేశం నుంచి తరలించే ప్రక్రియను దిగ్విజయంగా పూర్తి చేసింది. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా పూర్తి చేయగలిగామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(Joe Biden)స్పష్టం చేశారు. మరోవైపు రానున్న కాలంలో ఆఫ్ఘన్ దేశంతో దౌత్యసంబంధాలను(Diplomatic Relations) కొనసాగిస్తామని అమెరికా ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆఫ్ఘన్ నుంచి దౌత్య సంబంధాల్ని ఖతార్ నుంచి నిర్వహిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ (Antony Blinken)తెలిపారు. మిలటరీ ఆపరేషన్ ముగిసిందని..ఇకపై డిప్లొమాటిక్ మిషన్ ప్రారంభం కానుందని చెప్పారు. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్‌లో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుందని వ్యాఖ్యానించారు. 


ఆ దేశంలో మరికొద్ది మంది అమెరికా పౌరులు చిక్కుకుపోయారని..వారిని కూడా త్వరలోనే స్వదేశానికి తరలిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించవద్దని తాలిబన్లకు(Talibans) కోరారు. మహిళలు, మైనార్టీల హక్కుల్ని కాలరాసేలా వ్యవహరించవద్దని సూచించారు. ఉగ్రవాదాన్ని పెంచే చర్యలకు ఊతమివ్వద్దని తెలిపారు. మానవతా దృక్ఫథంతో ఆఫ్ఘన్ ప్రజలకు సహాయం చేస్తుంటామని బ్లింకెన్ చెప్పారు. తాలిబన్ ప్రభుత్వం(Taliban government) ద్వారా కాకుండా ఐక్యరాజ్యసమితి, ఎన్జీవోల ద్వారా సహాయం అందుతుందన్నారు. 


Also read: Operation Evacuation: ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాల తరలింపు విజయవంతం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook