Covaxin Vaccine: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఇదొక శుభవార్త. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లేకపోయినా..అమెరికా మాత్రం కొందరికి ఆ విషయంలో మినహాయింపు ఇచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో రెండు రకాల వ్యాక్సినేషన్ (Vaccination) కార్యక్రమం కొనసాగుతోంది. మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఒకటైతే రెండవది సీరమ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్. అయితే గత కొద్దికాలంగా కోవాగ్జిన్ వ్యాక్సిన్ విషయంలో అస్పష్టత నెలకొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు లేకపోవడమే కారణం. ఫలితంగా కోవాగ్జిన్ (Covaxin) తీసుకుని..విదేశాలకు వెళ్లాలనుకున్నవారికి విఘాతం ఎదురైంది. డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో అమెరికా గుడ్‌న్యూస్ అందిస్తోంది. కోవాగ్జిన్ వేసుకున్న భారతీయ విద్యార్ధులపై ఆంక్షల్ని ఎత్తివేసినట్టు అమెరికా ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల భారతీయ విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదం లేకపోవడంతో పలు దేశాలు ఇప్పటికే కోవాగ్జిన్‌పై ఆంక్షలు విధించారు. అమెరికాలో(America) అయితే ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా రెండు వ్యాక్సిన్లనే అనుమతిస్తున్నారు. డబ్ల్యుహెచ్‌వో గుర్తింపు లేని వ్యాక్సిన్లు రెండు డోసులు పూర్తయినా..అన్ వాక్సినేటెడ్‌గానే పరిగణిస్తున్నాయి విదేశాలు. ఈ నేపధ్యంలో విద్యార్ధుల వరకూ కోవాగ్జిన్ తీసుకున్నా అనుమతిస్తామని అమెరికా ప్రకటించడం గమనార్హం.


Also read: Kerala Fishermen Case: కేరళ జాలర్ల హత్యకేసు, ఇటలీ నావికులకు విముక్తి కల్పించిన సుప్రీంకోర్టు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook