America: అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న గన్ కల్చర్.. అబ్రహంలింకన్ సహా దుర్మరణం చెందిన నలుగురు అధ్యక్షులు వీళ్లే..
America Gun culture: అమెరికాలో గన్ కల్చర్ అక్కడున్న వారికి టెన్షన్ పుట్టిస్తుంది. అక్కడ పౌరులు ఇష్టమున్నట్లు తమతో పాటు గన్ లను క్యారీ చేస్తుంటారు. తాజాగా, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడి తర్వాత దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది.
America gun culture history 4 president died history: అమెరికా మాజీఅధ్యక్షుడు ట్రంప్ మీద కాల్పుల ఘటనలో అగ్రరాజ్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటికే అమెరాకాలో కాల్పుల ఘటనలు వార్తలో ఉంటునే ఉంటాయి. స్కూళ్లలో సైతం పిల్లలు తమతో పాటు గన్ లను తెచ్చుకుని,టీచర్లపై కాల్పులు జరిపిన ఘటనలు కొకొల్లలు. అదే విధంగా కొందరు జాత్యహాంకార ధోరణివల్ల కూడా, ఇతర దేశాల నుంచి అమెరికాకు చదువు కోవడానికి, జాబ్ ల కోసంవచ్చిన వారిపై కూడా కాల్పులు జరిపి హత్యలు చేసిన ఘటనలు గతంలో అనేకం జరిగాయి. అక్కడ లైసెన్స్ గన్ లను ఎక్కువ మంది తమతో క్యారీ చేస్తుంటారు. ఏటీఎంలు, వాలెట్ లు, డబ్బులు పెట్టుకున్నట్లు వాళ్లు..తమతోపాటు గన్ కూడా పెట్టుకుంటారు.
కొందరు సైకోలుగా మారి.. కన్పించిన వారిమీద కాల్పలు జరిపిన ఘటనలు గతంలో అనేకం జరిగాయి. తాజాగా, అమెరికాలోని ఎన్నికల నేపథ్యంలో .. మాజీ అధ్యక్షుడు ట్రంప్ మీద దుండగుడు కాల్పులు జరపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమెరికాలో అధ్యక్షుడు, మాజీ అధ్యక్షులకు ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఇంత టైట్ సెక్యూరిటీలో కూడా సదరు దుండగుడు కాల్పులు జరపడం పెనుదుమారంగా మారింది. కానీ కాల్పుల ఘటన నుంచి ట్రంక్ వెంట్రుక వాసిలో తప్పించుకున్నారు. సీక్రెట్ ఏజెన్సీ పోలీసులు దుండగుడిని మాత్రం సెకన్ల వ్యవధిలో కాల్పి చంపారు.
కాల్పులకు తెగబడింది.. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్ గా పోలీసులు గుర్తించారు. అతని వద్ద ఎలాంటి ఐడీ కార్డులు, ఫోన్ లు మాత్రం లభించలేదు. పోలీసులు అతని డీఎన్ఏ నుంచి ల్యాబ్ కు పంపించి వివరాలు రాబట్టేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ ఘటన జరగటం తీవ్ర సంచలనంగా మారింది. ఇలాంటి ఘటనలకు అమెరికాలో తావులేదని కూడా గాయపడ్డ ట్రంప్ తెల్చి చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో నలుగురు అధ్యక్షుడు ఇలా కాల్పులలో మరణించినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. ఇలాంటి దాడుల్లో ముగ్గురు అగ్రరాజ్య అధ్యక్షులు మాత్రం వెంట్రుక వాసిలో ప్రాణాలతో బైటపడ్డారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచి, అమెరికా 16 వ ప్రెసిడెంట్.. అబ్రహాం లింకన్ గన్ కాల్పుల్లో మరణించారు. వాషింగ్టన్ డీసీలోని ఫోర్డ్స్ థియేటర్‌లో 1865 ఏప్రిల్ 14న ఆయనపై దాడి జరిగింది. జాన్ బూత్ అనే నటుడు ఆయనపై కాల్పులు జరిపి హత్యచేశాడు. అదే విధంగా.. జేమ్స్ గర్‌ఫీల్డ్, 20 వ అమెరికా అధ్యక్షుడిపైకూడా.. 1881 జులై 2దాడి జరిగినట్లు తెలుస్తోంది. వాషింగ్టన్‌లోని బాల్టిమోర్-పోటోమ్యాక్ రైల్‌రోడ్ స్టేషన్ దగ్గర గుర్తుతెలియని ఆగంతకుడు ఆయన్ని కాల్చి హతమార్చాడు. విలియమ్ మెకెన్లీ, అమెరికా 25వ అధ్యక్షుడి మీద 1901 సెప్టెంబర్ 6లో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఒక కార్యక్రమానికి హాజరైన అధ్యక్షుడిపై ఒక దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన మెకెన్లీ చికిత్స పొందుతూ అదే ఏడాది సెప్టెంబర్ 14న చనిపోయారు.
అదే విధంగా.. అమెరికా 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీపై 1963 నవంబర్ 22న డాలస్‌లో దుండగులు దాడిచేశారు. ఆయన కాన్వాయ్ వెళ్తుండగా.. మాజీ సైనికుడు లీ హార్వే ఓస్వాల్డ్ కాల్పులు జరిపాడు. అరగంట వ్యవధిలోనే ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు కొందరు అధ్యక్షులుమాత్రం వెంట్రుక వాసిలో ప్రాణాలతో బైటపడ్డారు. అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్డ్, అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, ప్రస్తుతం తాజాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెంట్రుక వాసిలో ప్రాణాలతో బైటపడ్డారు. ఈ నేపథ్యంలో అమెరికాలో గన్ కల్చర్ ఏరంగా పెట్రేగిపోయిందో దీన్ని బట్టి అర్థం చేసుకొవచ్చు. ప్రస్తుతం ఈ ఘటనపై మాత్రం ప్రపంచ దేశాలుతీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి