కరోనా వైరస్ ( Corona virus ) మహమ్మారి ఇంకా పీడిస్తూనే ఉంది. కొన్ని దేశాలైతే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అలా భావించి స్కూల్స్ తెరవడంతో ఘోరం జరిగిపోయింది. ఏది అనుమానించారో అదే జరిగింది. అగ్రరాజ్యం అమెరికాలో ఏం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ మహమ్మారి ( Corona pandemic ) ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూనే ఉంది. కొన్నిదేశాల్లో అయితే ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. మరి కొన్నిదేశాల్లో ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ విద్యా సంవత్సరం ( Academic year ) స్కూళ్లను తెరిచేందుకు ( Schools re open ) ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ప్రారంభమయ్యాయి కూడా. అదే ఇప్పుడు కొంపముంచేసింది. అలా ప్రారంభించిన అమెరికా...ఇప్పుడు చేసిన తప్పు తెలుసుకుంటోంది. స్కూళ్లు తెరిచిన రెండు వారాల్లోనే అమెరికాలో ( America ) ఏకంగా 97 వేల మంది చిన్నారులకు కరోనా వైరస్ ( Corona virus ) సోకినట్టు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ( American acacemy of paediatrics ) వెల్లడించింది. జూలై 16 నుంచి జూలై 30 మద్యకాలంలో దాదాపు లక్షమంది పిల్లలకు కరోనా సోకడంతో స్కూళ్లను తిరిగి తెరిపించే నిర్ణయంపై అధికారులు పునరాలోచనలో పడ్డారు. 


మరోవైపు అమెరికాలో ఇప్పటివరకూ కరోనా వైరస్ బారిన పడ్డ 50 లక్షల మందిలో 3 లక్షల 38 వేల మంది పిల్లలేనని సీబీఎన్ న్యూస్ ( CBN news ) కూడా ప్రకటించింది. రానున్న కాలంలో పిల్లలకు కరోనా నిర్ధారణ పరీక్షల్ని( Covid 19 tests ) మరింతగా పెంచాలని వాండర్ బిల్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెబుతున్నారు. అు కరోనా కారణంగా అమెరికాలో దాదాపు 25 వేలమంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇటు తల్లిదండ్రులు కూడా ఆన్ లైన్ క్లాసులవైపే మొగ్గు చూపుతున్నారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకూ స్కూళ్లు వద్దంటున్నారు. Also read: First Covid-19 Vaccine: తొలి కోవిడ్-19 వ్యాక్సిన్ ఆగస్టు 12న తెస్తామన్నరష్యా..WHO ఏమంటోంది?


భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు స్కూళ్లను తెరిచేందుకు ఆలోచన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అమెరికాలో ఎదురైన పరిస్థితిని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓ విద్యా సంవత్సరం నష్టపోయినా ఫరవాలేదు కానీ..పిల్లల ప్రాణాలు ముఖ్యమంటున్నారు. Also read:Nepal Ayodhya: మళ్లీ అవే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధాని కేపీ శర్మ ఓలి