America Elections: అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. జో బైడెన్‌కు అగ్నిపరీక్ష.. రంగంలోకి ట్రంప్
US Mid Term Election: ప్రస్తుం అందరి కళ్లు అమెరికా మధ్యంతర ఎన్నికలపై నెలకొంది. ఈ ఎన్నికలు జో బైడెన్‌కు అగ్నిపరీక్షగా మారగా.. ట్రంప్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు.
US Mid Term Election: అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు వేళ అయింది. లక్షలాది మంది అమెరికన్లు మధ్యంతర ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అమెరికాతో పాటు యావత్ ప్రపంచం దృష్టి ఎన్నికలపైనే ఉంది. మధ్యంతర ఎన్నికలు అధికార జో బిడెన్‌తో పాటు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా అగ్ని పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల ఫలితాలు 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిని నిర్ణయిస్తాయి. మధ్యంతర ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా..
నేడు జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో మిలియన్ల మంది అమెరికన్లు ఓటు వేయనున్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పనితీరుకు ఇవి రెఫరెండంగా ఈ ఎన్నికలు నిలవనున్నాయి. బిడెన్ రెండోసారి అమెరికా అధ్యక్షుడవ్వాలనుకుంటే ఈ ఎన్నికలు ఆయనకు అత్యంత కీలకం కానున్నాయి.
మధ్యంతర ఎన్నికలలో ఓటర్లకు యూఎస్ ఆర్థిక వ్యవస్థ ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే.. పదవికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు గానీ.. 2024 అధ్యక్ష ఎన్నికలపై కూడా నేరుగా ప్రభావం చూపుతాయి. ఈ ఎన్నికలు తనకు కలిసివస్తాయని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమాగా ఉన్నారు.
మధ్యంతర ఎన్నికలు ఎందుకు..?
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అవి అధ్యక్షుడు తన నాలుగు సంవత్సరాల పదవీ కాలంలో.. హాఫ్ టైమ్ పూర్తిగానే మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. ఇది ప్రధానంగా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, యూఎస్ సెనేట్ నియంత్రణ కోసం పోటీ జరగనుంది. హౌస్, సెనేట్‌లోని దాదాపు 500 స్థానాలకు 1,200 మందికి పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. డెమోక్రాట్ పార్టీ అభ్యర్థులు ప్రస్తుతం ప్రెసిడెన్సీతో పాటు కాంగ్రెస్ ఉభయ సభలలో అత్యధికంగా ఉన్నారు.
ఈ మధ్యంతర ఎన్నికలు అమెరికాన్ కాంగ్రెస్‌ను ఎవరు శాసించాలో నిర్ణయిస్తాయి. కాంగ్రెస్‌పై నియంత్రణను ఎవరు తీసుకుంటారో వారు అమెరికన్ చట్టంపై గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉంటారు. సమాఖ్య చట్టాలను రూపొందించడం, చర్చించడం, ఆమోదించడం వంటి బాధ్యతలను కలిగి ఉంటారు. ఈ ఎన్నికలు రాబోయే రెండేళ్లలో బిడెన్ అధ్యక్ష ఎజెండా కోసం దృక్పథాన్ని కూడా నిర్దేశిస్తాయి. మధ్యంతర ఎన్నికలు సాధారణంగా అధ్యక్ష పదవి మొదటి రెండు సంవత్సరాలలో ప్రజాభిప్రాయ సేకరణగా పరిగణిస్తారు. అయితే మధ్యంతర ఎన్నికల్లో చాలావరకు అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగులుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు త్వరలోనే వెల్లడవుతుండగా.. ఇప్పటికే దాదాపు 38.8 మిలియన్ల అమెరికన్లు ఇప్పటికే వ్యక్తిగతంగా లేదా మెయిల్ ద్వారా ఓటు వేసినట్లు తెలుస్తోంది.
Also Read: Ind Vs Eng: ఇంగ్లాండ్‌తో టీమిండియా సెమీస్ పోరు.. ఆ ప్లేయర్‌కు ఛాన్స్
Also Read: Meerpet Minor Girl: మీర్ పేటలో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook