India Playing 11 Vs England: టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ పోరుకు టీమిండియా సిద్ధమవుతోంది. పటిష్ట ఇంగ్లాండ్ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ దశలో నాలుగు విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్న భారత్.. సెమీస్‌లోనూ విజయ పరంపరను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై చర్చ జరుగుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఏమైనా మార్పులు చేస్తాడా..? భారత కూర్పు ఎలా ఉండబోతుందో ఓ లుక్కేద్దాం..
మొదటి మ్యాచ్‌లో విఫలమైన కేఎల్ రాహుల్.. బంగ్లాదేశ్, జింబాబ్వేలపై హాఫ్ సెంచరీలతో విమర్శలకు చెక్ పెట్టాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న రాహుల్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయడం ఖాయం. ఈ బ్యాట్స్‌మెన్ ఇద్దరూ క్రీజ్‌లో కుదురుకుంటే.. ప్రత్యర్థి బౌలర్లు ఎవరైనా స్కోరు బోర్డు పరుగులు పెట్టాల్సిందే.
స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో రానున్నాడు. రెండు హాఫ్ సెంచరీలతో మంచి జోష్‌లో ఉన్నాడు రన్‌మెషీన్. సెమీఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌ను ఆడితే.. టీమిండియా గెలుపు సులభమవుతుంది. నాలుగో స్థానంలో మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు దిగనున్నాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో బౌలర్లను ఉతికి ఆరేస్తున్న సూర్యకుమార్.. ఇప్పటివరకే మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐదోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.
జింబాబ్వేతో మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న రిషబ్ పంత్.. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. జింబాబ్వేపై పంత్ కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. బూమ్రాలేని లోటును యువ బౌలర్ అర్షదీప్ సింగ్ చక్కగా నెరవేరుస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 9 వికెట్లు తీశాడు. అతనికి తోడు మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ కూడా బాగా రాణిస్తుండడంతో ఎలాంటి సమస్యలు లేవు. స్పిన్ బాధ్యతలను రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌లు పంచుకోనున్నారు. అక్షర్ పటేల్ ఇటు బాల్‌తో పాటు.. అటు బంతితోనూ రాణించాల్సిన అవసరం ఉంది.
టీమిండియా తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్/రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.
Also Read: Rohit Sharma: సెమీ ఫైనల్‌కు ముందు రోహిత్ శర్మకు గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్
Also Read: Chandra Grahan Time: చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఈ సమయాల్లో ఆలయాలు మూసివేత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook